ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. విరాట్ కోహ్లీ చైనా మొబైల్ కంపెనీ అయిన వివో బ్రాండ్ ప్రమోషన్స్ లో నటించాడు. ఇటీవలే ఇక ఈ కంపెనీ టీవీ లో గాని సామాజిక మాధ్యమాల్లో గాని ప్రకటనలు ప్రసారం చేయకూడదని నిర్ణయించుకుంది. అయితే ఇది తాత్కాలికమే అన్నది ప్రస్తుతం ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ఎదుర్కొంటుంది వివో కంపెనీ. ఇక ఈ వ్యవహారం తేలేంతవరకూ కూడా అటు కంపెనీ యాడ్స్ ప్రసారం ఆపేయనున్నట్లు తెలుస్తుంది.
కాగా 2021లో వివో ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు విరాట్ కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఈడీ దర్యాప్తు నేపథ్యంలో కొద్దిరోజులపాటు కనిపించేందుకు అటు విరాట్ కోహ్లీ టీం విముఖత వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఎందుకంటే ఈడి దర్యాప్తు కొనసాగుతున్న బ్రాండ్ కు ప్రమోషన్ నిర్వహిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉన్నందున ఇక ముందు జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక వివో కంపెనీ తో చేసుకున్న ఒప్పందానికి క్యాన్సల్ చేసుకోవడమే కాదు ప్రకటనల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు అని తెలుస్తోంది. కాగా భారత్-చైనా ఘర్షణల నేపథ్యంలో అటు ఐపీఎల్ స్పాన్సర్గా వ్యవహరించిన వివో తప్పుకుంది అన్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి