సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయినా సూర్యకుమార్ యాదవ్ ఏకంగా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 55 బంతుల్లో 11 ఫోర్లు ఆరు సిక్సర్లు సహాయంతో 117 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ ఎంతో వీరోచితంగా పోరాటం చేసినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్ల నుంచి సహకారం లేకపోవడంతో చివరి ఓటమిపాలైంది. ఇండియా ఓడినప్పటికీ అటు సూర్యకుమార్ యాదవ్ మాత్రం సెంచరీతో టీమ్ ఇండియా అభిమానులే కాదు ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు అభిమానుల మనసులు కూడా గెలిచాడు. పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అన్నది తెలుస్తోంది.
పొట్టి ఫార్మాట్ లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన మొదటి బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గతంలో ఈ రికార్డ్ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మాక్స్వెల్ పేరిట ఉండేది. టీమిండియా తో బెంగుళూరు లో 2019 లో జరిగిన మ్యాచ్లో అదరగొట్టాడు. ఇక ఆ మ్యాచ్లో మ్యాక్స్వెల్ 113 పరుగులు చేసాడు. దీంతో ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లోనూ మూడో స్థానంలో వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు అతని పేరునే ఉండేది. కానీ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ 117 పరుగులతో ఆ రికార్డును బ్రేక్ చేసేసాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి