
తిరిగి ఫామ్ లోకి రావడంతో టీమిండియాలో అవకాశం దొరికింది. ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతున్నాడు. అయితే చాహల్ తిరిగి ఫామ్ లోకి రావడం పై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ హర్షం వ్యక్తం చేశాడు. చాహల్ ఇటీవలికాలంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక రాబోయే టి20 ప్రపంచకప్లో చాహల్ ఆస్ట్రేలియా పిచ్ లపై మరింత మెరుగ్గా రాణిస్తాడు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒక క్రీడా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రాడ్ హాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. చాహల్ ఈ ఏడాది కాలంగా ఎంతో మెరుగవడం గమనిస్తూనే ఉన్నాను.
ఒకానొక సందర్భంలో అతను జట్టులో నుంచి వైదొలగిన పరిస్థితుల నుంచి ఇప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని తిరిగి పంచుకునే జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే స్థాయికి ఎదిగాడు. టి-20 ప్రపంచకప్ లో అతడిని కొనసాగించడం ఖాయం అయితే కేవలం ప్రదర్శన పరంగా మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా అతను ఎంతగానో పరిణతి చెందాడు. అయితే ఈసారి వరల్డ్ కప్ లో టీమిండియా ఫేవరెట్ జట్లలో ఒకటి అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే టి20 క్రికెట్ లో లెగ్ స్పిన్నర్ ఉంటే ఏ జట్టుకైనా బాగా కలిసి వస్తుంది.. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈసారి టీమిండియా తరపున టి20 వరల్డ్ కప్ లో చాహల్ రాణిస్తాడని నమ్ముతున్నా అంటూ బ్రాడ్ హాగ్ చెప్పుకొచ్చాడు..