గత కొన్ని రోజుల నుంచి టీమిండియా వరుసగా పర్యటనలతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ పర్యటన ముగిసిందో లేదో ఆలస్యం చేయకుండా వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరింది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో పాటు ఐదు మ్యాచ్ల టి-20 సిరీస్ కూడా ఆడబోతోంది. అయితే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా వెస్టిండీస్ పై పూర్తి ఆధిపత్యం సాధించి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగి మొదటి మ్యాచ్లో విజయం సాధించి శుభారంభం చేసింది.


 అయితే ఇక ఈ టి 20 సిరీస్ ముగిసిన వెంటనే అటు భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్ల పోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది భారత జట్టు. ఈ క్రమంలోనే మరోసారి విశ్రాంతినిచ్చి ద్వితీయ శ్రేణి జట్టును జింబాబ్వే పర్యటనకు భారత జట్టు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. కాగా జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ ఆడబోతుంది టీమిండియా. ఇటీవలే అందుకు సంబంధించిన జట్టు వివరాలను టీమిండియా సెలక్టర్లు ప్రకటించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో కెప్టెన్ గా అదరగొట్టిన శిఖర్ ధావన్ కు జింబాబ్వే పర్యటనలో సారథ్య బాధ్యతలు అప్పగించారు.


 ఆగస్టు 18, 20, 22 తేదీల లో ఈ మ్యాచ్ లూ జరగబోతున్నాయి అన్నది తెలుస్తోంది. చాలా కాలంగా గాయం కారణంగా జట్టుకు దూరమైన దీపక్ చాహర్ వాషింగ్టన్ సుందర్ బ్లూలూ కోలుకుని ప్రస్తుతం జట్టులోకి పునరాగమనం చేశారూ అన్నది తెలుస్తుంది. వీరి ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక రాహుల్ త్రిపాటీ తొలిసారి వన్డేలకు ఎంపికయ్యాడు.. రోహిత్ శర్మ సహా సీనియర్లు అందరికీ కూడా విశ్రాంతి ఇచ్చింది టీమిండియా. మేనేజ్మెంట్ ఈ క్రమంలోనే టీమిండియా మేనేజ్మెంట్ ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన వివరాలు ఇలా ఉన్నాయి.


జట్టు వివరాలు: శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శుబ్‌మన్‌ గిల్, హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్, సామ్సన్, సుందర్, శార్దుల్, అక్షర్, కుల్దీప్, అవేశ్, ప్రసిధ్, సిరాజ్,  దీపక్‌ చహర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: