ఇటీవలే ఆసియా కప్లో భాగంగా రెండు విజయాలు సాధించి సూపర్ 4 లో అడుగుపెట్టింది టీమిండియా.. కానీ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ చేతిలో మాత్రం సూపర్ 4లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియాకు అటు ఆసియా కప్లో ఫైనల్కు వెళ్లడం ఎంతో క్లిష్టంగా  మారిపోయింది. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగిన నేపథ్యంలో మిగిలిన రెండు జట్లతో జరగబోయే మ్యాచ్లలో కూడా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే ఆదివారం రోజున పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ గురించి ఇప్పటికే చర్చ జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే.


 ముఖ్యంగా మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో టీమిండియా యువ బౌలర్ హర్ష దీప్ సింగ్   కీలకమైన క్యాచ్ జారవిడిచాడు. అయితే ఈ విషయంపై  ప్రస్తుతం టీమిండియా అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని వల్లే మ్యాచ్ ఓడిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ఇక ఇలాంటి సమయంలో ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రస్తుత క్రికెటర్లు కూడా హర్ష దీప్ సింగ్ కి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలాంటివి సహజమేనని.. అతను ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్నాడు.. చిన్న తప్పిదానికి అంతలా విమర్శలు అవసరం లేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.


 ఇలా హర్ష దీప్ సింగ్ కి మద్దతుగా నిలుస్తున్న వారిలో బాక్సర్ విజేందర్ సింగ్ కూడా చేరిపోయాడు అనే చెప్పాలి. పాకిస్థాన్ ఆటగాడు ఆసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్ వదిలేయడం పై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.  సోషల్ మీడియాలో ఎంతో మంది చేస్తున్న విమర్శలను ఉద్దేశిస్తూ కుక్కలు మొరుగుతూనే  ఉంటాయి. వాటిని పట్టించుకోవద్దు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు బాక్సర్ విజేందర్ సింగ్. ఏది ఏమైనా ఎవరు ఎంత చెప్పినా అటు హర్ష దీప్ సింగ్ పై విమర్శలు మాత్రం ఎక్కడా సోషల్ మీడియాలో ఆగడం లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: