
ఇక రెండవ మ్యాచ్ లో ఇండియా శ్రీలంక తో తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 150 పరుగులు చేసింది. ఇందులో జెమిమా రోడ్రిగ్స్ చెలరేగి ఆడింది.. తాను 53 బంతులను ఎదుర్కొని 11 ఫోర్లు మరియు సిక్సర్ సాయంతో 76 పరుగులు చేసింది. ఇక తనకు కెప్టెన్ హర్మన్ నుండి చక్కని సహకారం అందింది. శ్రీలంక కు కష్టమైన లక్ష్యాన్ని ఇచ్చింది... ప్రస్తుతానికి శ్రీలంక ఎనిమిది ఓవర్ లలో 55 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. అయితే టీం ప్రదర్శన బట్టి చూస్తే ఇండియాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి శ్రీలంక గెలవడం అసాధ్యం. అయితే పురుషుల జట్టు సాధించలేని ఆసియా కప్ ను మహిళలు అయినా సాధిస్తారా అంటూ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే ఇండియా కే ఆసియ కప్ అందుకునే అర్హత ఉందని తెలుస్తోంది. మరి వారి కోరిక తీరుతుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.