ఒకప్పుడు సెలబ్రిటీ హోదా సంపాదించాలి అంటే సినిమాలు చేయడం ఒక్కటే మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సినిమాలు చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో తమ టాలెంట్ ను బయట పెడితే చాలు దానంతట అదే సెలబ్రిటీ హోదాను తెచ్చి పెడుతూ ఉంటుంది. ఇక సినిమాలో అవకాశాల కోసం కూడా తిరగాల్సిన పనిలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో పాపులారిటీ వచ్చిందంటే చాలు ఏకంగా దర్శక నిర్మాతలే తమ సినిమాలలో సోషల్ మీడియా స్థార్లను పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాపులారిటీ సాధించి సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఇలా ఫేమస్ అయిన వారిలో గంగవ్వ కూడా ఒకరు.


 ఎక్కడో మారుమూలన ఒక చిన్న గ్రామంలో ఉండేది గంగవ్వ. కానీ ఇప్పుడు మాత్రం గంగవ్వ అంటే తెలియని వారు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న గంగవ్వ మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్కసారిగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన గంగవ్వ తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పాలి. ఇక మై విలేజ్ షో ద్వారా పాపులారిటీ సంపాదించి ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన డబ్బులతో ఇల్లు కూడా కట్టుకుంది గంగవ్వ.  ఇక పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తూ ఇప్పటికీ వీడియోలు చేస్తూనే ఉంది.


 అయితే ఇలా బాగా పాపులారిటీ సంపాదించిన గంగవ్వ ఆదాయం ఎంత ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. అయితే యూట్యూబ్ ఛానల్ లో వర్క్ చేయటం ద్వారా ఖర్చులు పోను నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం సంపాదిస్తుందట. ఇక సినిమాల్లో అవకాశాలు రావడంతో ఒక్క రోజుకు పదివేల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక త్వరలో ఒక వంటల ఛానల్ ప్రారంభించేందుకు కూడా గంగవ్వ ఆలోచన చేస్తుందట. ఏదో ఒక విధంగా నెలకు రెండు లక్షల సంపాదించాలని చూస్తుందట. ఇక త్వరలో ఒక పెద్ద సినిమాలో మంచి పాత్రలో గంగవ్వ కనిపించబోతుంది అన్నది మాత్రం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: