ఇక అప్పు తీసుకున్న వారిపై దాడులకు పాల్పడటమే కాదు అటు అప్పు తీసుకున్న వారి కుటుంబీకులపై కూడా ఎంతో పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలు చూస్తూ ఉంటే అవసరానికి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ఏకంగా అప్పు తిరిగి చెల్లించలేదు అన్న కారణంతో ఒక వ్యక్తి భార్యను కిడ్నాప్ చేశాడు అప్పు ఇచ్చిన వ్యక్తి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని వైయస్సార్ జిల్లా మైదుకూరులో వెలుగు చూసింది.
అతని వద్ద పనిచేసే కూలి రెండు లక్షల రూపాయలు అప్పుగా అప్పుగా తీసుకున్నాడు. అయితే ఇక అప్పు తిరిగి చెల్లించమని అడిగినప్పటికీ అతను మాత్రం డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో చెల్లించలేదు. దీంతో అప్పు ఇచ్చిన సుధాకర్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే బాధితుడి భార్యను బలవంతంగా తీసుకెళ్లాడు. ఇక ఆమెకు తన నర్సరీలో పనికి పెట్టుకున్నాడు. అయితే బాధితుడు మైదుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడికెళ్ళి యజమానిని అరెస్టు చేశారు. అతని చెరనుంచి విడిపించారు. ఇక ఈ విషయం పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కాస్తా స్థానికం గా సంచలనంగా మారి పోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి