టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతున్న నేపథ్యంలో అటు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఆయా మ్యాచ్ లపై రివ్యూలు ఇవ్వడం తరచూ జరుగుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి రివ్యూలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా టీం ఇండియా ప్రదర్శన పై అటు కేవలం భారత మాజీ ఆటగాళ్లు మాత్రమే కాదండోయ్ విదేశీ మాజీ ఆటగాళ్లు సైతం తెగ రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక్కో ఆటగాడి ప్రదర్శనను కూడా లెక్కేస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనె ఇటీవల టీమ్ ఇండియా ప్రదర్శన పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రివ్యూ ఇచ్చేశాడు. టీమిండియా ఎందుకో అంచనాలకు తగ్గట్టుగా ఆడటం లేదని కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఇరగదీస్తున్నాడు అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా అవతరించాడు. ఇండియా విజయం సాధించాలంటే కోహ్లీ ఆడాల్సిందే అంటూ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే రికీ పాంటింగ్ వ్యాఖ్యలపై భారత స్టార్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఇటీవల జింబాబ్వేతో మ్యాచ్ కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు రవిచంద్రన్ అశ్విన్.


 టి20 ప్రపంచ కప్ లో కొన్ని మ్యాచ్ లలో చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ పై ఇలాగే జరిగింది. అయితే టీ20 ఫార్మాట్ అంటేనే ఊహించని మలుపులు సర్వసాధారణం. కచ్చితంగా ఏదో ఒక సమయంలో మార్పు వస్తుందని భావిస్తున్నాను. ఇక మ్యాచ్ చూసే అభిమానులు విశ్లేషకులు ఎప్పుడూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉంటారు. అయితే ఇప్పటికీ మ్యాచ్ నుంచి మేము ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. కొన్ని కొన్ని సార్లు చిన్న మార్జిన్ తో మ్యాచ్ మారిపోతూ ఉంటుంది. అయితే జట్టు బాగా ఆడటం లేదు అన్నది సరైనది కాదు.. పరిస్థితులను బట్టి మేము ఆడాల్సి ఉంటుంది అంటూ అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: