ఇటీవల కాలంలో క్రికెట్ కు పాపులారిటీ ప్రపంచ వ్యాప్తంగా పాకిపోతున్న నేపథ్యంలో.. ఇక ప్రేక్షకులందరికీ కూడా మరింత నాణ్యమైన సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో ఉన్న పెద్దలందరూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు క్రికెట్ లో ఉత్కంఠ పెంచే విధంగా కొత్త రూల్స్ ని తెరమీదకి తీసుకురావడం.. ఇక మెగా టోర్నీలో నిర్వహించడంలో సరికొత్త నిబంధనలు విధించడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ముగిసింది. ఈ క్రమంలోనే 2024లో టి20 వరల్డ్ కప్ జరగబోతుంది. వెస్టిండీస్తో పాటు యూఎస్ఏ లో ఈ టోర్నీ నిర్వహించేందుకు ఐసిసి నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ మెగా టోర్నీ కోసం ఎవరు ఊహించని విధంగా కీలక మార్పులు చేయాలని ఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వరకు కేవలం టి20 వరల్డ్ కప్ లో రెండు గ్రూపులు మాత్రమే ఉండడం చూసాము. కానీ 2024 టీ20 వరల్డ్ కప్ లో మాత్రం ఏకంగా 20 జట్లు తలబడబోతుండగా వీటిని నాలుగు గ్రూపులుగా విభజించబోతున్నారట. ఇలా గ్రూప్ కి ఐదు జట్లను విభజిస్తారు.


 ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 లో నిలిచిన రెండు జట్లు.. అంటే మొత్తం కలిపి ఎనిమిది జట్లుగా మారుతాయి. దీంతో సూపర్ 8 ఫేస్ నిర్వహిస్తారట. సూపర్ 8 లో రెండు గ్రూపులు ఉంటాయి. ఇక ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. అయితే ఈ రెండు గ్రూపులలో టాప్ 2 లో నిలిచిన రెండు జట్ల మధ్య సెమీఫైనల్ నిర్వహిస్తారు. ఇక రెండు గ్రూపుల్లో నుంచి జట్ల మధ్య జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో గెలిచిన జట్లు ఫైనల్లో అడుగుపెడతాయి అని చెప్పాలి. ఇకపోతే ఆతిథ్య దేశాలుగా ఉన్న యూఎస్ఏ వెస్టిండీస్ ఎలాగో టోర్నీలో పాల్గొంటాయి. వీటితో పాటు ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఐసిసి ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలోనే ఉన్నాయి. ఇక వరల్డ్ కప్ లో అర్హత సాధించబోయే మిగతా జట్లు ఏవి అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: