సాధారణంగా ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతూ హవా నడిపిస్తున్నారు అంటే ఇక వాళ్లు అంతకుముందు ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడి ఉంటారో అన్నది దాదాపు అందరూ అర్థం చేసుకుంటారు. పూర్తి స్థాయి ఫిట్నెస్తో ఉన్నప్పుడు మాత్రమే క్రికెట్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. అయితే మిగతా వారితో పోల్చి చూస్తే ఇక ఫాస్ట్ బౌలర్లకు మరింత ఎక్కువ ఫిట్నెస్ అవసరం అని చెప్పాలి. అయితే ఇక క్రికెటర్లు తమ ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ఎలాంటి డైట్ ఫాలో అవుతుంటారు అన్న విషయం తెలుసుకోవడానికి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఇటీవలే ఒక స్టార్ బౌలర్ ఇక తన డైట్ గురించి రోజు తినే ఆహారం గురించి ఇటీవలే ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో స్టార్ కాస్ట్ బౌలర్గా కొనసాగుతున్నాడు హరీష్ రావుఫ్. ప్రస్తుతం అతనికి 29 ఏళ్లు. అయితే తన ఫిట్నెస్ సీక్రెట్ ని ఇటీవల వెల్లడించాడు. అకాడమీ శిక్షణ సమయంలో తాను రోజుకు 24 గుడ్లు తినేవాడిని అంటూ హరీష్ రావుఫ్ చెప్పుకొచ్చాడు. ఇక మాజీ బౌలర్ కోచ్ అయినా అఖీబ్ జావేద్ ఇచ్చిన డైట్ ప్లాన్ ను ఇప్పటికీ పాటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.


 24 గుడ్లలో.. 8 గుడ్లు బ్రేక్ ఫాస్ట్ సమయంలో.. 8 గుడ్లు లంచ్ సమయంలో.. మరో 8 గుడ్లు డిన్నర్ సమయంలో ఆహారంగా తీసుకుంటాను అంటూ తెలిపాడు. ముఖ్యంగా క్రికెట్ అకాడమీకి వెళ్లిన సమయంలో అక్కడ కుప్పలు తెప్పలుగా గుడ్లు ఉండేవని.. ఆ అకాడమీ పౌల్టీ ఫార్మ్ లో ఉండేదని హరీష్ రావుఫ్ గుర్తు చేసుకున్నాడు. ఇక అకాడమీకి వెళ్ళినప్పుడు తన బరువు 72 కిలోలే ఉండేదని కానీ 83 కిలోల బరువు పెరగాలని కోచ్ అకీబ్ సూచించాడని.. ఇక తన హైట్ కు అదే కరెక్ట్ అని చెప్పాడని.. ఇక ఎప్పుడూ తన బరువు 82 కిలోలు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: