వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు ఒక సాలిడ్ హిట్ ఇచ్చిన సినిమా బింబిసార. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ను సాధించింది అని చెప్పాలి. ఇక భారీ వసూళ్లు సాధించి అటు నిర్మాతలకు లాభాల పంట పండించింది. టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు అందరినీ కూడా అబ్బురపరిచింది అని చెప్పాలి.


 అయితే ఇటీవల కాలంలో హిట్ అయిన సినిమాలుకు సీక్వెల్స్ రావడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచినా బింబి సారా కి కూడా సీక్వెల్ రాబోతుంది అన్న ప్రచారం మొదలైంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అమిగోస్ అనే సినిమాతో ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న కళ్యాణ్ రామ్ ఇక ఆ తర్వాత డెవిల్ అనే సినిమాతో బిజీ కాబోతున్నాడు అని చెప్పాలి. దీంతో ఇక ఈ సినిమా ముగిసిన తర్వాత బింబిసారా  సీక్వెల్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వస్తుందని ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు.


 ఇలాంటి సమయంలోనే అభిమానులందరికీ కూడా కళ్యాణ్ రామ్ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు అని చెప్పాలి. డెవిల్ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయిందని ఇక వశిష్టతో కలిసి ఈ ఏడాది చివరి కల్లా బింబిసారా 2 సెట్స్ పైకి తీసుకెళ్లే పనుల్లో ఉంటామని ఇక కళ్యాణ్ రామ్ చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త మాత్రం కళ్యాణ్ రామ్ అభిమానులు అందరినీ కూడా సంతోషంలో ముంచేస్తుంది అని చెప్పాలి.  ఇకపోతే ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కాబోతున్న అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం  చేశాడు   రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: