
బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా మళ్ళీ టీమిండియాలోకి రి ఎంట్రీ ఇచ్చిన చటేశ్వర్ పూజార అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్ లలో కూడా మంచి ప్రదర్శన చేసే చెలరేగిపోయాడు. అయితే ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా భాగమయ్యాడు. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో చటేశ్వర్ పూజార తన బ్యాటింగ్ తో ఎక్కడ ప్రభావం చూపలేకపోయాడు అని చెప్పాలి. తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయి నిరాశపరిచాడు.
అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమిండియా మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఒక అరుదైన మైలు రాయిని అందుకున్నాడు అని చెప్పాలి. టెస్ట్ ఫార్మాట్లో భారత్ క్రికెట్లో కేవలం 12 మంది ఆటగాళ్ళకు మాత్రమే పరిమితమైన 100 టెస్టుల మైలురాయిని ఇటీవల పూజార కూడా అందుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే 100వ టెస్ట్ మ్యాచ్ లో అటు పూజార సెంచరీ చేస్తే బాగుండు అని అభిమానులు అందరూ కూడా ఎంతో బలంగా కోరుకున్నారు. కానీ పూజార మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. 100వ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేయడం కాదు పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుతిరికాడు. నాథన్ లియోన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు అని చెప్పాలి. దీంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు.