
విరాట్ కోహ్లీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంది అన్నది అతనికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఒక రుజువుగా చూపించవచ్చు. సాకర్ ఫుట్బాల్ ప్లేయర్స్ అయినా లియోనల్ మెస్సి, క్రిస్టియానో రోనాల్డో తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కోహ్లీకి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. ఇక రికార్డుల విషయంలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విషయంలో కూడా అటు మిగతా స్టార్ క్రికెటర్లతో పోల్చి చూస్తే అందనంత దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. అలాంటి కోహ్లీ నీ కలవాలని దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ కోహ్లీని కలిసే ఛాన్స్ వస్తే ఇక ఈ జన్మకి అంతకంటే ఇంకేం వద్దు అని భావిస్తూ ఉంటారు.
అలాంటిది ఇక్కడ ఒక మహిళ అభిమాని మాత్రం ఏకంగా విరాట్ కోహ్లీకి లిప్ కిస్ పెట్టేసింది. ఏంటి కోహ్లీకి లిప్ కిస్ పెట్టిందా.. అదెలా సాధ్యమైంది. అయినా అతను ఎలా ఒప్పుకున్నాడు అని షాక్ లో మునిగిపోయారు కదా. అంతలా కంగారు పడకండి ఎందుకంటే సదరు లేడీ ఫ్యాన్ లిప్ లాక్ పెట్టింది నిజమైన కోహ్లీకి కాదు కోహ్లీ రూపంలో ఉన్న మైనపు బొమ్మకు. పెదాలపై ముద్దు పెడుతూ అమ్మాయి ప్రదర్శించిన హావా బావాలు ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాయ్ అని చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.