
ఈ క్రమంలోనే ఇక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో అటు కెమెరామెన్ లు ఎక్కువగా కావ్య మారన్ ను అటు స్క్రీన్ లో చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక కెమెరామెన్ కావ్య మారన్ కు కోపం తెప్పించాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. 88 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ వంద పరుగులు కూడా చేయదని సన్రైజర్స్ సహా యజమాని అయినా కావ్య సంతోష పడిపోయింది అని చెప్పాలి.
కానీ కాసేపటికే సీన్ మొత్తం రివర్స్ అయింది అన్న విషయం తెలిసిందే. కెప్టెన్ దావన్ తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఏకంగా పరుగుల బోర్డును ముందుకు నడిపించాడు. దీంతో ఇక ఇలా జరిగిందేంటి అని స్టేడియంలో కూర్చున్న కావ్య మారన్ ప్రస్టేషన్ పీక్స్ కు చేరింది. ఇలాంటి సమయంలో ఆమె స్టాండ్స్ లో కూర్చొని సీరియస్ గా మ్యాచ్ చూస్తుండగా.. ఒక కెమెరామెన్ ఆమె వైపుగా కెమెరాను తిప్పాడు. అది గమనించిన కావ్య మారన్ నీకు నేనే దొరికానా చల్ హట్ అంటూ కెమెరామెన్ పై కోపం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే కావ్య మారన్ కోపంలో కూడా ఎంతో అందంగా ఉంది అంటూ నేటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారని చెప్పాలి.