ఇక అన్ని మ్యాచ్ లలో కూడా వరుసగా అర్థ సెంచరీలు చేస్తూ రాణిస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఇలా పరుగులు చేయడం విషయంలోనే కాదు మిగతా ఆటగాళ్లకు సహాయపడటం విషయంలో కూడా అటు నంబూరి తిలక్ వర్మ ముందు వరుసలోనే ఉన్నాడు అన్నది అర్థమవుతుంది. ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తనలోని క్రీడా స్ఫూర్తిని బయటపెట్టాడు తిలక్ వర్మ. ఇంతకీ ఏం జరిగిందంటే.. కోల్కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా నాలుగో ఓవర్ ను కామరూన్ గ్రీన్ వేశాడు. ఈ క్రమంలోనే వెంకటేష్ అయ్యర్ ఒక బంతిని స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.
అయితే మిస్ అయిన బంతి గట్టిగా మోకాలికి తగిలింది అని చెప్పాలి. దీంతో నొప్పితో వెంకటేష్ అయ్యర్ విలవిలలాడిపోయాడు అని చెప్పాలి. అదే సమయంలో అక్కడికి వచ్చిన తిలక్ వర్మ వెంకటేష్ అయ్యర్ బాధను చూసి తట్టుకోలేక పోయాడు. అతను ప్రత్యర్థి అయినప్పటికీ కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు అని చెప్పాలి. వెంటనే అతని కాలికి ఉన్న ప్యాడ్ ను తొలగించి మోకాలికి మర్దన చేశాడు తిలక్ వర్మ. ఇక తిలక్ వర్మ చర్యతో వెంకటేష్ అయ్యర్ కాస్త ఉపశమనం పొందాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఫిజియో వచ్చి అతనికి చికిత్స అందించాడు. అయితే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన తిలక్ వర్మ తన చర్యతో సోషల్ మీడియాలో మరోసారి హీరోగా మారిపోయాడు. అతను చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి