
అయితే ఆ తర్వాత మాత్రం ముంబై ఇండియన్స్ విజయం సాధించినప్పటికీ అటు వెంకటేష్ అయ్యర్ వీరోచితమైన ఇన్నింగ్స్ మాత్రం అభిమానుల మనసులు గెలుచుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు వరకు కోల్కతా నైట్ రైడర్ తరఫున ఐదు మ్యాచ్లు ఆడిన వెంకటేష్ అయ్యర్ 234 పరుగులు చేశాడు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ 233 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్న ప్లేయర్ గా ఉండగా.. ఒక్క పరుగు ఎక్కువ చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు వెంకటేష్ అయ్యర్. కాగా ఐదు మ్యాచ్లలో కలిపి ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ చేశాడు వెంకటేష్ అయ్యర్.
అటు శిఖర్ ధావన్ నాలుగు మ్యాచ్ లలో 233 పరుగులు చేశాడు. ఇక అతని అత్యుత్తమ స్కోరు 99 నాట్ అవుట్ కావడం గమనార్హం. ఆరెంజ్ క్యాప్ రేస్ లో శిఖర్ ధావన్ రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండగా.. ఇక మూడవ స్థానంలో అటు డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ మొత్తంగా ఐదు మ్యాచ్ల్లో కలిపి 228 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు కూడా ఉండడం గమనార్హం. ఇక డేవిడ్ వార్నర్ అత్యుత్తమ స్కోర్ 65 పరుగులు. ఏది ఏమైనా ఇక కోల్కతా జట్టు యంగ్ ఆల్రౌండర్ అయిన వెంకటేష్ అయ్యర్ అటు సీనియర్ బ్యాట్స్మెన్ దావన్ చేతిలో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకుని షాక్ ఇచ్చాడు అని చెప్పాలి.