సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ ని ఓటమితోనే ప్రారంభించిన సన్రైజర్స్ జట్టు ఆ తర్వాత వరుస ఓవటములతో అభిమానులు అందరిని కూడా నిరాశపరిచింది. కానీ అటు వెంటినే పుంజుకొని వరుసగా రెండు మ్యాచ్లలో విజయాన్ని సాధించింది. దీంతో సన్రైజర్స్ ఏదో సాధించేలాగే కనిపిస్తుంది అని అభిమానులు నమ్మకాన్ని పెంచుకున్నారు. కానీ ఆ తర్వాత ఏ మ్యాచ్ లో గెలుస్తుంది ఏ మ్యాచ్లో ఓడిపోతుంది అన్నది కూడా ఊహకంగానే మారిపోయింది.


 వెరసి హోమ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్లలో కూడా సన్రైజర్స్ ఓడిపోతూ ఉండడంతో ఇక అభిమానులు.. హైదరాబాద్ జట్టు ఆట తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా పేలవ ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే అటు హైదరాబాద్ జట్టు వరుసగా ఓటములు చవిచూస్తున్నప్పటికీ జట్టులో కీలక బౌలర్ గా ఉన్న భారత సీనియర్ ఫాస్ట్ భువనేశ్వర్ కుమార్ మాత్రం తన బౌలింతో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ రికార్డులు కొల్లగొడుతున్నాడు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో భువనేశ్వర్ కుమార్ బెస్ట్ ఎకనామికల్ బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఓడిపోయినప్పటికీ భువనేశ్వర్ కుమార్ తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసిన అతను కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు అని చెప్పాలి. దీంతో బెస్ట్ ఎకనామికల్ బౌలర్గా మారిపోయాడు భువనేశ్వర్ కుమార్. అంతకుముందు లక్నో బౌలర్ మార్క్ వుడ్ 4 ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి బెస్ట్ ఎకనామికల్ బౌలర్గా కొనసాగాడు అని చెప్పాలి. భువి అదరగొడుతున్న సన్రైజర్స్ మాత్రం గెలవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl