సాధారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అప్పటివరకు సహచరులుగా ఉన్న ఆటగాళ్లు ఇక ఐపీఎల్ లో మాత్రం ప్రత్యర్ధులుగా మారిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న టీం ను గెలిపించేందుకు హోరాహోరీగా పోరును సాగిస్తూ ఉంటారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఇలా సహచరులుగా ఉన్న ఆటగాళ్ల మధ్య ఉత్కంఠ నేపథ్యంలో గొడవలు జరగడం కూడా చూస్తూ ఉంటాం. ఇలా స్నేహితులుగా ఉన్నవారే ఐపిఎల్ లో గొడవపడుతూ ఇక మ్యాచ్ ని మరింత ఉత్కంఠ భరతంగా మారుస్తూ ఉంటారు.



 అయితే ఇటీవలే 2023 ఐపీఎల్ సీజన్ ముగిసింది. అటు ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పంచింది అనడంలో సందేహం లేదు. ఇక 2023 ఐపీఎల్ సీజన్ మొత్తంలో అందరికీ గుర్తుండిపోయే వివాదం ఏదైనా ఉంది అంటే అది విరాట్ కోహ్లీ తో నవీన్ ఉల్ హక్, గౌతమ్ గంభీర్ లకు జరిగిన గొడవే అని చెప్పాలి.ఈ గొడవపై అటు రిపరీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏకంగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మ్యాచ్ ఫీజులో 100% కోత విధిస్తున్నట్లు కూడా నిర్ణయం తీసుకున్నారంటే గొడవ ఎంత తీవ్ర స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే లక్నో బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లీ నవీన్ ఉల్ హల్ మధ్య జరిగిన గొడవ గురించి గౌతమ్ గంభీర్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 ఆ రోజు మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీ, నవీన్ మధ్య జరిగిన గొడవలో నవీన్ తప్పు ఏమీ లేదు అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. అందుకే అతని వైపు నిలబడ్డాను అంటూ తెలిపాడు. అది నా బాధ్యత కూడా. దీన్ని నేను చివరి శ్వాస వరకు కొనసాగిస్తాను. నవీన్ కాకుండా ఎవరిది కరెక్ట్ అనిపిస్తే వారికి మద్దతు తెలుపుతాను. నా టీం పక్క టీం అనేది నాకు అనవసరం.. ఎవరిది తప్పు లేకపోతే వారి సైడ్ నిలబడతా.. కోహ్లీతో నాకు వ్యక్తిగత గొడవలు ఏమీ లేవు అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: