ఇంగ్లాండ్ సీనియర్ ఆల్రౌండర్ మోయిన్ అలీ ఇక ఎన్నో రోజులపాటు ఇంగ్లాండ్ జట్టుకు దూరంగానే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెష్ సిరీస్ లో మాత్రం ఇక రీ ఎంట్రీ ఇచ్చాడు మోయిన్ అలీ. ఇక తన రీ ఎంట్రీ మ్యాచ్లోనే అదిరిపోయే ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అద్భుతమైన బంతితో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామరూన్  గ్రీన్ ను క్లీన్ హోల్డ్ చేశాడు.  అయితేఅతను వేసిన బంతికి అటు సహచర ఆటగాళ్లే కాదు బ్యాట్స్మెన్ కామరూన్ గ్రీన్  సైతం తెల్ల మొహం వేశాడు అని చెప్పాలి.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విటర్ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 67వ ఓవర్లో ఇక ఈ ఘటన జరిగింది. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. అయితే ఆఫ్ సైడ్ పడిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకుంది. ఇక ఆ బంతిని డిఫెరెంట్ చేయడానికి ప్రయత్నించాడు గ్రీన్. కానీ బంతి అతని బ్యాట్ కి తగలకుండా గ్యాప్ లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో అటు బ్యాటింగ్ చేస్తున్న గ్రీన్ సైతం ఒక్కసారిగా బిత్తర పోయాడు అని చెప్పాలి. ఇక చేసేదేమీ లేక గ్రీన్ నిరాశతోనే పెవీలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో గ్రీన్ 38 పరుగులు చేశాడు.



 ఈ క్రమంలోనే ఇక అతను వేసిన అద్భుతమైన బంతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారగా.. ఇక దీనిపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. ఇక భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. వాట్ ఏ బ్యూటీ మోయిన్ అంటూ గ్రీన్ అవుట్ అయిన వీడియోని బజ్జి ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు అని చెప్పాలి. ఇకపోతే యాషెష్ తొలి టెస్ట్ ఎంతో రసవతరంగా సాగుతుంది. ఇంగ్లాండు తన తొలి ఇన్నింగ్స్ ను 393/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 100 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: