సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో అద్భుతంగా రాణించాలని ఎన్నో రికార్డులు కొల్లగొట్టాలని ప్రతి ఒక్క క్రికెటర్ కూడా భావిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఎంత పరుగులు చేసిన కూడా టెస్ట్ ఫార్మాట్ ని మాత్రం ఎంతో స్పెషల్ గా భావిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే యంగ్ ప్లేయర్స్ నుంచి సీనియర్ ప్లేయర్స్ వరకు కూడా టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువ రోజులు కెరియర్ కొనసాగించాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే టెస్ట్ ఫార్మాట్ అనేది ప్రతి ఒక్క ఆటగాడు ప్రతిభకు సవాల్ లాంటిదే.



 సవాలను ఎదుర్కొంటూ ఇక టెస్ట్ ఫార్మాట్లో ఆటను కొనసాగించాల్సి ఉంటుంది. బ్యాట్స్మెన్ అయితే ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు ఆచితూచి పరుగులు చేస్తూ రికార్డులు కొల్లగొట్టాల్సి ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు బెస్ట్ ఫార్మాట్లో అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసిన ప్లేయర్లు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది ప్లేయర్లు సాధించిన రికార్డులు ఇప్పటికీ కూడా పదిలంగానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి రికార్డులలో టీమిండియా ఓపనర్ వీరేంద్ర వీరేంద్ర సెహ్వాగ్ సాధించిన రికార్డు కూడా ఒకటి అని చెప్పాలి. టెస్ట్ ఫార్మాట్లో ఓపెనర్ గా బరులోకి దిగి ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు వీరేంద్ర సెహ్వాగ్ కెరియర్లో సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో 8027 పరుగులు చేశాడు.


 అయితే అప్పుడెప్పుడో వీరేంద్ర సెహ్వాగ్ టెస్ట్ ఫార్మట్ లో సాధించిన రికార్డును ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బద్దలు కొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్లో ఓపెనర్ గా వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఐదవ బ్యాట్స్మెన్ గా వార్నర్ రికార్డు సృష్టించాడు 8027 పరుగులతో ఉండగా వార్నర్ 8028 పరుగులతో నిలిచాడు. ఓపెనర్ గా వచ్చి అత్యధిక పరుగులు చేసిన వారిలో అలిస్టర్ కుక్  11845, సునీల్ గవాస్కర్ 9607, గ్రేమ్ స్మిత్ 9030,  హెడెన్ 8625 పరుగులతో తొలి నాలుగు స్థానాలలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: