ఇక వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎంతోమంది భారత మాజీ ఆటగాళ్ళు వరల్డ్ కప్ గురించి ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక టీమిండియా ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపే వ్యాఖ్యలు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. 2011 వరల్డ్ కప్ గెలిచిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. 2011లో సచిన్ కు ఘనంగా వీడ్కోలు ఇచ్చేందుకు ప్రపంచకప్ గెలిచాము. అప్పుడు జట్టులో సచిన్ లెజెండ్ గా ఉంటే.. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. భారత జట్టు కోహ్లీ కోసం ఆడాలి. వన్డే వరల్డ్ కప్ 2023 ని గెలిచి కోహ్లీకి బహుమతిగా అందించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇదే లక్ష్యంతో బరిలోకి దిగాలి.
కోహ్లీ గొప్ప ఆటగాడు.. వరల్డ్ కప్ లో అతను ఎన్నో పరుగులు చేశాడు. ఈసారి కూడా మైదానంలో 100% కష్టపడతాడు అనడంలో సందేహం లేదు. మిగతావారు కూడా అతనికి సహాయం అందించాలి అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా 2011లో చివరిసారిగా భారత్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన సమయంలో జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఇక వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కోహ్లీ తన భుజాలపై సచిన్ ను ఎత్తుకొని వాంకడే స్టేడియం చుట్టూ తిరిగాడు. ధోని సిక్స్ కొట్టి ఇక రెండోసారి భారత జట్టుకు వరల్డ్ కప్ అందించిన క్షణాలను ఇప్పటికి కూడా ప్రేక్షకులు మరిచిపోరూ అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి