జమాన్ ఖాన్ విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో సంచలన బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇతను బౌలింగ్ మలింగ బౌలింగ్ ను పోలి ఉంది. వరుస యార్కర్లతో బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టాడు. వరుస వికెట్లు పడగొడుతున్నాడు. తాజాగా జమాన్ ఖాన్ ప్రత్యర్థి బ్యాటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది. సోమవారం డెర్బీషైర్, వోర్సెష్టర్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వోర్సెష్టర్‌షైర్ 3.4 ఓవర్లలోనే 45 పరుగులు చేసింది. ఆ తరువాత ఒక వికెట్ పడింది. ఆ తరువాత న్యూజిలాండ్ స్టార్ మిచెల్ సాంట్నర్, హెయిన్స్‌కు జత కలిశాడు. వీరిద్దరూ కలిసి 72 భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో జమాన్ ఖాన్ బౌలింగ్ కు వచ్చాడు. 13వ ఓవర్ వేసిన జమాన్ ఖాన్ అద్భుతమైన యార్కర్ తో సాంట్నర్ ను పెవిలియన్ చేర్చాడు. జమాన్ ఖాన్ వేసిన బాల్ సాంట్నర్ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి వికెట్లను తాకింది. యార్కర్ తో పాటు పేస్ కూడా యాడ్ చేయడంతో రెండు స్టంప్‌లు గాలిలో ఎగిరిపడ్డాయి. నాలుగు ఓవర్ లు వేసి 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం గెలవలేకపోయింది. కానీ ఇప్పుడు జమాన్ ఖాన్ వేసిన యార్కర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి