ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతూ ఉన్నాయి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఇక ఈ రెండు జట్లు కూడా చెరో అయిదు సార్లు టైటిల్ విజేతగా నిలిచాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ రెండు టీమ్స్ కి అటు ఉన్న పాపులారిటీ కూడా సేమ్ ఉంటుంది. అయితే ఈ రెండు ఛాంపియన్ టీమ్స్ తో సమానంగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఒక జట్టు పాపులారిటీ సంపాదించింది. ఆ టీం ఏదో కాదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్థానం మొదలైంది.


 ప్రతి సీజన్లో ఈ టీం కి  ఉన్న పాపులారిటీ అంతకంతకు పెరిగిపోయింది అని చెప్పాలి. అయితే ప్రతి సీజన్లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ  ఉంటుంది. కానీ ఊహించని రీతిలో పేలవ ప్రదర్శన చేసి చివరికి నిరాశ పరుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ బెంగళూరు జట్టుకు మాత్రం అదృష్టం ఎప్పుడు కలిసి రావట్లేదు. అయితే కెప్టెన్గా కోహ్లీ తప్పుకొని డూప్లెసిస్ కూ సారధ్య బాధ్యతలు చేపట్టిన.. బెంగళూరు జట్టు ఫేట్ మాత్రం మారలేదు.


 ఈ క్రమంలోనే ఒక్కసారి కూడా టైటిల్ గెలవకుండా నిరాశలో మునిగిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక ఇప్పుడు జట్టులో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమవుతుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న మైక్ హేస్సన్, బ్యాటింగ్ కోచ్గా ఉన్న సంజయ్ బంగర్ లను ఆ ఫ్రాంచైజీ విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు టైటిల్ గెలవకపోవడం, గత సీజన్లో పేలో ప్రదర్శనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బౌలింగ్ కోచ్ గ్రిఫిత్ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట ఫ్రాంచైజీ. ఇటీవల లక్నో జట్టు కూడా హెడ్ కోచ్ ను తప్పించి కొత్త కోచ్ ను నియమించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb