ప్రస్తుతం టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనలో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో  కూడా సిరీస్ లు ఆడుతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్లో వర్షం కారణంగా డ్రాగ ముగియడంతో 1-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా జోరు మీద ఉంది. అయితే  నేటి నుంచి అటు వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఆడబోతుంది అని చెప్పాలి. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా మరోసారి సిరీస్ ను కైవసం చేసుకుని ఆతిధ్య వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిపోతుంది.


 కాగా భారత్, వెస్టిండీస్ మధ్య బార్బిడాస్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ నేడు ప్రారంభం కాబోతుంది. సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ వన్డే సిరీస్ లో భాగంగా అటు టీమ్ ఇండియా ప్లేయర్లను ఎన్నో అరుదైన రికార్డులు ఊరిస్తూ ఉన్నాయి . మరో మూడు వికెట్లు తీశాడు అంటే చాలు రవీంద్ర జడేజా కరేబియన్ గడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టిస్తాడు. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొడతాడు. అదే సమయంలో ఇక టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్లుగా  కొనసాగుతున్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీనీ సైతం మరో రెండు రికార్డులు ఊరిస్తూ ఉన్నాయి.


 కెప్టెన్ రోహిత్ శర్మ 175 పరుగులు చేశాడు అంటే చాలు వన్డే ఫార్మాట్లో పదివేల పరుగులు మైలు రాయిని అందుకుంటాడు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ మరో 102 పరుగులు చేశాడు అంటే వన్డే ఫార్మాట్లో 13000 క్లబ్లో చేరుతాడు. ఇలా ఇద్దరు స్టార్ క్రికెటర్లను అరుదైన రికార్డులు ఊరిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇక వెస్టిండీస్తో జరగబోయే వన్డే సిరీస్ లో ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా సెంచరీ చేసి అదరగొట్టాల్సి ఉంటుంది. కాగా వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో రోహిత్ ఫామ్ లోకి రాగా..  కోహ్లీ తన పాత  ఫామ్ నే కొనసాగిస్తూ ఇరగదీస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: