ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో భాగంగా పది జట్లు ఈ మెగా టోర్నీలో టైటిల్ కోసం పోరాడబోతున్నాయి. అయితే ఎనిమిది జట్లు వరల్డ్ కప్ కోసం నేరుగా క్వాలిఫై అయితే మరో రెండు స్థానాల కోసం మాత్రం కొన్ని టీమ్స్ క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే క్వాలిఫైయర్ మ్యాచ్లు కూడా పూర్తయ్యాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక వరల్డ్ కప్ లో తలబడబోయే 10 టీమ్స్ ఏవి అన్న విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది.


 ఈ షెడ్యూల్ నేపథ్యంలో ఏ తేదీన ఏ మైదానంలో ఏ ప్రత్యర్థిని  ఎదుర్కొంటున్నాము అనే విషయంపై కూడా ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కోసం అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు అన్ని టీమ్స్ సిద్ధం అవుతూ ఉన్నాయి. ఏకంగా వరుసగా ద్వైపాక్షి సిరీస్ లు ఆడుతూ ఆయా సిరీస్లలో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు వరల్డ్ కప్ జట్టులో స్థానం కల్పించడమే లక్ష్యంగా ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయ్. ఇలాంటి సమయంలో కొంతమంది ఆటగాళ్లను పక్కన పెట్టడం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


 ఇలా ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అయ్యేలా క్రికెట్ ఆస్ట్రేలియా ఒక నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్ కప్ 2023 కోసం ప్రిలిమినరి జట్టును ప్రకటించింది. ఇందులో ఆస్ట్రేలియా ఇక కీలక ఆటగాడిని ఎంపిక చేయకపోవడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని గురించి ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వన్డే ఫార్మాట్లో మిడిల్ ఆర్డర్ లో మంచి బ్యాట్స్మెన్ గా పేరు ఉన్న మర్నాస్ లబుషేన్ ను పక్కన పెట్టింది క్రికెట్ ఆస్ట్రేలియా. కాగా లబుషేన్ చివరిసారిగా ఆసిస్ తరఫున ఈ ఏడాది భారత్తో వన్డే సిరీస్ ఆడాడు. కాగా అతను ఇప్పుడు వరకు 30 వన్డేల్లో 847 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: