వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతోండగా.. ఆటగాళ్లు తమ రికార్డులను ప్రేక్షకులు ఆకట్టుకుంటున్నారు. వన్డే వరల్డ్ కప్ ప్రారంభమై కొద్ది రోజులు మాత్రమే కాగా.. ఇప్పటికే అనేక రికార్డులు నమోదయ్యాయి. వీటిల్లో చెత్త రికార్డులు కూడా చాలానే ఉన్నాయి. తక్కువ పరుగులకే కొన్ని జట్లు ఆలౌట్ అవ్వగా.. మరి కొంత మంది క్రికెటర్లు సెంచరీ లో చెలరేగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. చిన్న జట్లు కూడా అద్బుత ప్రదర్శన కనబరుస్తూ ఊహాలకు అందని విధంగా ఆడుతున్నాయి.

అయితే ఈ సారి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక టీమిండియా వరల్డ్ కప్ ను ముద్దాడి చాలా రోజులైంది. ప్రతీసారి టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. కానీ సెమీ ఫైనల్, ఫైనల్ దశ లోనే ఒక్క అడుగు దూరం లోనే వరల్డ్ కప్ సాధించలేక పోతుంది. ఈ సారి కూడా టీమిండియా హాట్ ఫేవరెట్ గా ఉంది. ఆటగాళ్లు అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. దీంతో ఈసారి భారత్ కప్ గెలుస్తుందంటూ టీమిండియా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

ఈ క్రమంలో ఇంగ్లండ్ టెస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఖచ్చితం గా ఫైనల్ కు చేరుతుందని జోస్యం చెప్పాడు. బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ షోలో తాజాగా అతడు పాల్గొన్నాడు. ఈ సందర్బం గా వన్డే వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరే నాలుగు జట్ల గురించి తన అంచనాను బయట పెట్టాడు. పాక్, న్యూజిలాండ్ కు సామర్థ్యం ఉన్నా సెమీస్ కు రావడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా సెమీస్ కు చేరుకుంటాయని అన్నాడు. టీమిండియా ఫైనల్ కు చేరుకుంటుందని, కానీ ఫైనల్ లో టీమిండియాను ఓడించి ఇంగ్లండ్ కప్ గెలుస్తుందని అండర్సన్ చెప్పాడు.జ

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc