అంతర్జాతీయ క్రికెట్లో ఇటీవల ట్రాన్స్ జెండర్ గా మారిపోయిన డేనియల్ మేక్ గాహె  మహిళా జట్టులోకి ఎంట్రీ ఇచ్చి టి20 లలో ఆడటం చర్చనియాంశంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా మహిళా టీమ్స్ తరఫున ఆడిన మొదటి ట్రాన్స్ జెండర్గా ఆమె రికార్డ్ సృష్టించారు. అయితే ఈ క్రమంలోనే ఎంతో మంది ట్రాన్స్ జెండర్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇటీవలే ఇలా మహిళా క్రికెట్లో ట్రాన్స్ జెండర్ల పాత్ర విషయంపై అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఉమెన్స్ క్రికెట్ లో అత్యున్నత స్థాయిలో ఆడకుండా ట్రాన్స్ జెండర్లపై క్రికెటర్లకు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐసిసి అంతర్జాతీయ మహిళల ఆట సమగ్రతను క్రీడాకారుల భద్రతను కాపాడేందుకే.. ఇక ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది అని చెప్పాలి. అంతర్జాతీయ ఆట కోసం కొత్త లింగార్హత నిబంధనలను క్రీడా వాటాదారులతో తొమ్మిది నెలల సంప్రదింపు తర్వాతనే ఆమోదించినట్లు తెలుస్తోంది. ఇక కొత్త నిబంధన ప్రకారం మగ నుండి ఆడగా మారిన ఏ క్రికెటర్ అయిన ఏ శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ.. మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో ఆడలేరు.


 ఈ క్రమంలోనే ఇలా మహిళలు అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన మొదటి ట్రాన్స్ జెండర్ గా రికార్డు సృష్టించిన డేనియల్ మేక్ గాహ సైతం ఇక మహిళ అంతర్జాతీయ క్రికెట్లో పాల్గొనలేదు అని చెప్పాలి. కాగా ఆమె కెనడా తరపున 6 టీ20లో 23 ఏళ్ల మెక్ గాహే  బ్రెజిల్ మహిళపై అత్యధిక స్కోరు 48 కాగా.. మొత్తంగా 118 పరుగులు చేసింది. అయితే ఇలా మహిళా అంతర్జాతీయ క్రికెట్లో ట్రాన్స్ జెండర్లు ఆడటంపై నిషేధం ఇచ్చిన ఐసీసీ.. ఇక దేశీయంగా లింగ అర్హత అనేది ఆయా దేశాలకు సంబంధించిన బోర్డు పరిధిలోనిదే. అది వారి ఇష్టం అంటూ ఐసిసి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: