
అదేంటి బ్యాటర్ కొట్టిన బంతిని ఫీల్డర్ అందుకుంటే క్రికెట్ నిబంధనల ప్రకారం ఐదు పరుగుల పెనాల్టీ విధించడం ఏంటి అని షాక్ అవుతున్నారు కదా.. అయితే ఇలా క్యాచ్ పట్టడంలో సదరు ఫీల్డర్ చిన్న పొరపాటు చేసింది. ఈ పొరపాటే చివరికి వారి కొంపముంచింది. 2023 మహిళల బిగ్ బాసష్ లీగ్ లో భాగంగా ఇటీవల బిస్బెన్ హీట్ సిడ్నీ సిక్సర్స్ జట్లు తలపడ్డాయి. ఐసీసీ నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడంతో ఈ మ్యాచ్ లో బ్రిస్బేన్ హీట్ జట్టు సిడ్నీ సిక్సర్ కి 5 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. అదనంగా వచ్చిన ఐదు పరుగులతోనే సిడ్నీ టీం గెలుపొందింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సిడ్ని బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బెన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన సిడ్ని ఓపెనర్స్ పర్వాలేదు అనిపించారు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో మంచూ ప్రభావం పెరిగింది. కారణంగా ప్లేయర్లు అందరు ఎప్పటికప్పుడు టవల్తో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. అయితే సిడ్నీ విజయానికి 66 బంతుల్లో 113 పరుగులు కావాలి. ఇలాంటి సమయంలో పదో ఓవర్ వేయడానికి అమీలియా కేర్ బంతి అందుకుంది. అయితే రెండో బంతిని క్రీజులో ఉన్న గార్డినర్ మిడ్ వికెట్ మీదగా ఆడింది. అక్కడే ఫీల్డింగ్ లో ఉన్న ప్లేయర్ బంతి అందుకుని.. కేర్ వైపు విసిరింది. ఆ సమయంలో కేర్ చేతిలో టవల్ ఉండగానే బంతి అందుకుంది. దీంతో ఇక ఆమె చేసిన తప్పిదాన్ని గుర్తించిన అంపైర్ ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు. దీంతో బ్రిస్బేన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.