2023 వన్డే వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బలులోకి దిగింది భారత జట్టు. సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ టోర్ని కావడంతో ఇక వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదే అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే టీమిండియా ప్రస్థానం కొనసాగింది అని చెప్పాలి. మొదటి మ్యాచ్ నుంచి సెమీఫైనల్ మ్యాచ్ వరకు వరుసగా ఒక్క ఓటమి కూడా లేకుండా 10 విజయాలు సాధించింది భారత జట్టు. దీంతో ఫైనల్లో కూడా ఆస్ట్రేలియాలో చిత్తుగా ఓడించి భారత్ పుష్కరకాలం తర్వాత టైటిల్ సొంతం చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు.


 కానీ ఊహించని రీతిలో ఫైనల్ మ్యాచ్లో టీమిండియా తడబడింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు భారత్ పై విజయం సాధించి ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది అని చెప్పాలి. అయితే సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ లో అయినా టైటిల్ గెలవాలని ఆశపడిన భారత జట్టుకు చివరికి నిరాశ ఎదురయింది. ఇప్పుడు 2024 t20 వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా భారత జట్టు ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టులో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు సెలక్టర్లు. వచ్చే ఏడాది టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో భారత సెలెక్టర్లకి ఒక సలహా ఇచ్చాడు మాజీ క్రికెటర్ పార్థివ్  పటేల్.


 2024 t20 వరల్డ్ కప్ కోసం సరైన కాంబినేషన్ను కనుగొనడమే టీం ఇండియా ముందు ఉన్న అతిపెద్ద సవాల్ అంటూ మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు. రైట్ కాంబినేషన్ లేకపోవడం వల్లే గత ఐసిసి టోర్నమెంట్లలో భారత జట్టు ఓడిపోయింది అంటూ అభిప్రాయపడ్డాడు.  2024 t20 వరల్డ్ కప్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన ప్లేయర్లపైనే ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వరల్డ్ కప్ టీం ఎంపిక చేయాలని.. అనుకుంటే మధ్యలోనే చేయాల్సి ఉంటుందని.. అలా సాధ్యం కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: