మరికొంత కాలం లోనే టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో (బీ సీ సీ ఐ) ఈ సారి టి 20 వరల్డ్ కప్ కి ఎవరిని పంపాలి అనే విషయంపై ఇప్పటి నుండే కసరత్తు చేయడం మొదలు పెట్టింది. ఇక ఈ సారి (బీ సీ సీ ఐ) టి 20 వరల్డ్ కప్ కి 15 మంది స్క్వాడ్ ను ... ఐదు మంది స్టాండ్ బై ప్లేయర్ లను ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే (బీ సీ సీ ఐ) 20 మంది ఆటగాళ్లను కూడా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

ఇకపోతే మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే టి 20 వరల్డ్ కప్ కి వెళ్ళబోయే అవకాశాలు ఉన్న ఆ 20 మంది ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం. బీసీసీఐ సెలెక్ట్ చేసిన 20 మందిలో రోహిత్ శర్మ ఒకరు. ఈయనే ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ జట్టుకు విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఇందులో జైస్వాల్ , శుభం గిల్ , సూర్య కుమార్ యాదవ్ , హార్దిక్ పాండ్యా , రిషబ్ పంత్ , రింకు , కె ల్ రాహుల్ , సంజు సాంసంగ్ , రవీంద్ర జడేజా , దుబే , అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ ,  చాహల్ , బిష్ణోయ్ , జస్ప్రీత్ బూమ్రా , సిరాజ్ ,  అర్ష్ దీప్ , అవేష్ ఉన్నారు. ఈ 20 మందిని బీసీసీఐ నెక్స్ట్ టి20 వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపుగా ఈ లిస్టులో చాలా మంది టాప్ ప్లేయర్లు ఉన్నారు. దానితో ఈ లిస్టు మారినప్పటికీ అందులో ఒకటి , రెండు పేర్లు మాత్రమే మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ ఒకటి , రెండు మార్పులైనా ఉంటాయా..? లేదా ఇలానే బిసిసిఐ టి20 వరల్డ్ కప్ ను ప్లేయర్ పంపిస్తుందా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: