ఐపీఎల్ 2024 లోకి భారీ అంచనాల నడుమ అడుగుపెట్టిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. ఈ టీం లో స్టార్ ప్లేయర్ ఎం ఎస్ ధోని ఉండడంతో ఎంతో మంది ప్రేక్షకులు ఈ టీం ఈ సారి ఐ పీ ఎల్ ట్రోఫీ ని గెలుచుకుంటుంది అని భావించారు. ఈ జట్టు కూడా ఈ సీజన్ ప్రారంభం నుండి పరవాలేదు అనే పర్ఫామెన్స్ ను కనబరిస్తూ పాయింట్ల పట్టికలో మంచి స్థానం లోనే కొనసాగుతూ వచ్చింది. ఇకపోతే నిన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో తలపడింది.

ఈ మ్యాచ్ బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ గెలిస్తేనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఓడిపోయింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ భారీ తేడాతో చెన్నై ని ఓడించి ప్లే ఆప్స్ లోకి వెళ్ళింది. ఇక ఈ మ్యాచ్ ఓడిపోవడానికి పరోక్షంగా ధోని కొట్టిన భారీ సిక్స్ కారణం అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... నిన్న జరిగిన మ్యాచ్ లో ధోని 110 మీటర్ల ఓ భారీ సిక్స్ ను కొట్టాడు. ఈ భారీ సిక్స్ వల్ల బంతి గ్రౌండ్ అవతల పడింది. దాని వల్ల బౌలర్ యశ్ దయాల్ కి ఎంపైర్ లు కొత్త బంతిని ఇచ్చారు. ఇది ఈ బౌలర్ కి ఎంతగానో సహకరించింది. ఆ కొత్త బాల్ పై గ్రిప్ దొరకడంతో డయల్ గొప్పగా బౌలింగ్ చేశారు. ఇక ఆ తర్వాత రెండో బంతికే ధోని ఇతను అవుట్ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో కూడా కేవలం ఒకే ఒక పరుగును ఇచ్చాడు.

ఎలా ధోని ఆ భారీ సిక్స్ కొట్టడం వల్లే బంతి బౌండరీ అవతల పడడం , ఆ తర్వాత కొత్త బంతిని ఎంపర్ బౌలర్ కి ఇవ్వడం , ఆ బంతి గ్రిప్ దొరకడంతో దయాల్ అద్భుతమైన బౌలింగ్ వేసి ధోని వికట్ తీయడం, మాత్రమే కాకుండా ఆ ఓవర్ లో తక్కువ పరుగులు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగి ఆర్ సి బి గెలిచినట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: