సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫీల్డర్లు మైదానం మొత్తం ఫీల్డింగ్ చేయడం చూస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే. బ్యాట్స్మెన్ కొట్టిన బంతిని ఎక్కడ బౌండరీ పోకుండా ఉండేలా పకడ్బందీగా ఆయా జట్టు కెప్టెన్లు ఫీల్డింగ్ సెట్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్లు కూడా ఏకంగా బ్యాటింగ్ చేస్తున్న ప్లేయర్ నూ రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయడం లాంటి అరుదైన ఘటనలు అప్పుడప్పుడు క్రికెట్లో జరుగుతూ ఉంటాయి. ఇటీవల ఇలాంటి ఘటన జరిగింది అని చెప్పాలి.
ఏకంగా క్రికెట్లో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇంగ్లాండు కౌంటి క్రికెట్లో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒకే ఫ్రేమ్ లో 13 మంది ప్లేయర్లు కనిపించారు. సోమర్ సెట్ పై 252 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన సర్రే టీం 109/9 స్కోర్ వద్ద నిలిచింది. అయితే మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుంది అన్న సమయంలో సోమర్ సెట్ బౌలర్ వికెట్ కీపర్ మాత్రమే కాకుండా 9 మంది ఫీల్డర్లనూ కూడా బ్యాట్స్మెన్ చుట్టూ ఉంచాడు ఆ జట్టు కెప్టెన్. దీంతో ఒత్తిడితో సర్రె బ్యాట్స్మెన్ టికెట్ సమర్పించుకున్నాడు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో సర్రే టీం కి చెందిన ఇద్దరు బ్యాట్స్మెన్లు ఇక సోమర్ సెట్ కు చెందిన 11 మంది ఆటగాళ్లు ఒకే ప్రేమలో కనిపించారు.