
ఇప్పటికే ఒక్కో టీమ్ కనీసం ఏడు మ్యాచ్లు ఆడేసింది. పాయింట్ల పట్టిక చూస్తే టాప్-4లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఈ నాలుగు జట్లు కూడా చెరో 10 పాయింట్లతో దుమ్ము దులిపేస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా 8 పాయింట్లతో వాళ్ల వెంటే ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మాత్రం 6 పాయింట్లతో కాస్త వెనకబడ్డాయి. రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఇంకాస్త వెనకబడి 4 పాయింట్లతో నెట్టుకొస్తున్నాయి. ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా 16 పాయింట్లు ఉండాలి. ఒక్కోసారి అదృష్టం బాగుంటే 14 పాయింట్లు ఉన్నా ఛాన్స్ కొట్టేయొచ్చు.
గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ జట్లకు ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. ఇంకో మూడు మ్యాచ్లు గెలిచినా చాలు, దాదాపు 16 పాయింట్ల దగ్గరికి వచ్చేస్తారు. లక్నో అయితే 8 మ్యాచ్లు ఆడి 5 గెలిచింది. ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాళ్లు కూడా ఇంకో 3 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లు పక్కా.
RCBకి కూడా మంచి ఛాన్స్ ఉంది. వాళ్లు మిగిలిన 7 మ్యాచ్‌ల్లో 4 గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకోవచ్చు. మిగతా టీమ్స్‌కి మాత్రం ఇక నుంచి ప్రతి మ్యాచ్ చావో రేవో తేల్చుకోవాల్సిందే.
కోల్‌కతా, ముంబై జట్లకు ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కనీసం 5 మ్యాచ్లు గెలవాల్సిందే. హైదరాబాద్, చెన్నై జట్లు అయితే ఏకంగా 7కి 6 మ్యాచ్లు గెలవాలి, ఇది మాత్రం చాలా కష్టం.
రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి మరీ దారుణం. వాళ్లకు ఇంకా 6 మ్యాచ్లే మిగిలాయి. ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే అన్ని మ్యాచ్‌లు గెలవాలి, ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంపాజిబుల్ అనే చెప్పాలి.
• కింగ్ మేకర్స్ ఎవరు మరి
ఏ జట్లకైతే ప్లే ఆఫ్స్‌కి వెళ్లే ఛాన్స్ లేదో, వాళ్లు ప్రెజర్ లేకుండా ఫ్రీగా ఆడేస్తారు. అప్పుడే వాళ్లు చాలా డేంజరస్ అవుతారు. స్ట్రాంగ్ టీమ్స్‌ని కూడా ఓడించేసి ప్లే ఆఫ్ రేసు ఫలితాన్నే మార్చేస్తారు. అందుకే వాళ్లని ‘కింగ్ మేకర్స్’ అంటారు. వాళ్లు ప్లే ఆఫ్స్‌కి వెళ్లకపోయినా, ఎవర్ని పంపాలో మాత్రం వాళ్లే డిసైడ్ చేస్తారు.
ఇంకో రెండు మూడు వారాలు మాత్రం క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగే. ప్రతీ మ్యాచ్ పాయింట్ల పట్టికను మార్చేస్తుంది. ఏ టీమ్ కూడా ఇకపై లైట్ తీసుకోవడానికి లేదు.