
హాట్ టాపిక్ ఏంటంటే, నెంబర్ 6 బ్యాటింగ్ స్లాట్. అశ్విన్ ప్రకారం, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ ఉందట. యంగ్ వికెట్ కీపర్-బ్యాటర్ జురెల్ ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నా, కరుణ్ నాయర్ మాత్రం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అందుకే, అనుభవం, నిలకడకే ఓటేస్తూ అశ్విన్ మన కరుణ్ నాయర్ వైపే మొగ్గు చూపాడు.
అంతేకాదు, నెంబర్ 8 బౌలింగ్ ఆప్షన్ విషయంలో టీమిండియాకు పెద్ద తలనొప్పి తప్పదంటున్నాడు అశ్విన్. జస్ప్రీత్ బుమ్రా ఐదు టెస్టులూ ఆడటం డౌటే కాబట్టి, ఆ ప్లేస్‌లో సరైన సపోర్ట్ కావాలి. మరి అక్కడ శార్దూల్ ఠాకూర్‌నా, కుల్దీప్ యాదవ్‌నా, లేక మూడో ఫాస్ట్ బౌలర్‌తో బరిలోకి దిగాలా? ఈ పజిల్‌ను అశ్విన్ మన ముందుంచాడు.
ఇక సిరీస్‌లో టాప్ పెర్ఫార్మర్ల గురించి అశ్విన్ చెప్పిన జోస్యం వింటే నోరెళ్లబెట్టాల్సిందే! ఫ్యాన్స్ అంతా బుమ్రా దుమ్మురేపుతాడని అనుకుంటే, అశ్విన్ మాత్రం మహమ్మద్ సిరాజ్ ఇండియా తరఫున టాప్ వికెట్ టేకర్ అవుతాడని బాంబు పేల్చాడు. మరి ఇంగ్లండ్ టీమ్‌లో? క్రిస్ వోక్స్ (అన్ని మ్యాచ్‌లు ఆడితే) లేదా యంగ్ స్పిన్ సెన్సేషన్ షోయబ్ బషీర్ అదరగొడతారని అశ్విన్ అంచనా వేశాడు.
పరుగుల వరద పారించేది ఎవరు? ఇక్కడ కూడా అశ్విన్ సర్‌ప్రైజ్ చేశాడు. కేఎల్ రాహుల్ కంటే రిషబ్ పంత్‌కే మన యాష్ జై కొట్టాడు. పంత్ ఫ్రీగా ఆడితే, అతన్ని ఔట్ చేయడం బౌలర్లకు పెద్ద సవాలేనని, తనను తాను తప్ప ఇంకెవరూ ఔట్ చేయలేరంటూ (అంటే అంత ఈజీగా వికెట్ ఇవ్వడని) ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో సీనియర్ జో రూట్ ఎలాగూ ఉన్నాడు, కానీ యంగ్ గన్ బెన్ డకెట్‌పై కూడా ఓ లుక్కేయమంటున్నాడు అశ్విన్.
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు అశ్విన్ అంచనా వేసిన భారత జట్టు ఇదే:
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.