
అయితే ఈ విషయం విన్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సుమారుగా 35 ఏళ్ల సైనా సీనియర్ స్టార్ అయినప్పటికీ.. జూలై 13 వ తేదీన ఆదివారం అర్ధరాత్రి తన ఇంస్టాగ్రామ్ లో ఈ విధంగా ఒక ప్రకటనను విడుదల చేసింది.. చాలా ఆలోచించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని" జీవితం కొన్నిసార్లు మనల్ని వేరువేరు మార్గాలలోకి నడిపిస్తుంది.. చాలా ఆలోచన చర్చల తరువాతే తను కశ్యప్ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని మేము మా శాంతి ఎదుగుదల స్వస్థతను ఎంచుకుంటున్నామంటూ తెలిపింది".
2018లో సైనా నెహ్వాల్, కశ్యప్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాదులో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ అకాడమీగా పేరుపొందిన పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకునే సమయంలో కలుసుకున్నారు. అక్కడే నుంచే వీరిద్దరు శిక్షణ పొందారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వారు విడిపోవడానికి గల కారణం మాత్రం తెలియదు కానీ మొత్తానికి విడాకులు తీసుకున్నారు.
సైనా నెహ్వాల్ తన ఒలంపిక్ కాంక్ష పతాకం, కరణం మల్లేశ్వరి తర్వాత మళ్లీ ఒలంపిక్ పథకం గెలుచుకున్న రెండవ ఇండియన్ మహిళగా పేరు సంపాదించింది. 2015లో సైనా నెహ్వాల్ మహిళా సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకింగ్ని సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా నిలిచింది.
ఇక కశ్యప్ ప్రపంచ టాప్ - 10 లోకి ఉంటు 2014లో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణాన్ని గెలిచారు. 2024లో తన క్రీడా జీవితాన్ని ముగించేసి కోచింగ్ ప్రారంభించారు.