తాజాగా సౌతాఫ్రికా ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ లో మొదటి వన్డే మ్యాచ్ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ వన్డే మ్యాచ్ ఎంతో రసవత్తరంగా  జరుగుతుంది అని సౌతాఫ్రికా , ఇంగ్లాండ్ రెండు జట్లు అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తాయి అని , ఇందులో రసవత్తరమైన పోటీ ఏర్పడి ఎవరో ఒకరు గెలుస్తారు అని చాలా మంది క్రికెట్ అభిమానులు భావించారు. కానీ ఇలా అస్సలు జరగలేదు. సౌతాఫ్రికా దాటికి ఇంగ్లాండ్ జట్టు కుప్ప కూలి పోయింది. ఏకంగా 50 ఏళ్ల తర్వాత ఒక చెత్త రికార్డు ను కూడా ఇంగ్లాండ్ జట్టు తన పేరున నమోదు చేసుకుంది.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా సౌతాఫ్రికా , ఇంగ్లాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ లోకి దిగింది. ఇక ఈ జట్టు బ్యాటింగ్ ను  మొదలు పెట్టినప్పటి నుండి వికెట్లను కోల్పోతూనే వచ్చింది. దానితో 24.3 ఓవర్లలో ఈ జట్టు కేవలం 131 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఆ తర్వాత అత్యల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు ఈ టార్గెట్ ను చాలా సులువుగా చేదించింది. దానితో మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా జట్టు భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఒక చెత్త రికార్డును కూడా సొంతం చేసుకుంది.

హెడింగ్లి మైదానంలో ఇంగ్లాండ్ చేసిన అత్యల్ప స్కోర్ లలో ఇది రెండవ స్థానంలో నిలిచింది. 1975 వ సంవత్సరంలో ఈ మైదానంలో ఇంగ్లాండు జట్టు వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా పై కేవలం 93 పరుగులకే ఆల్ అవుట్ అయింది. మళ్లీ 50 సంవత్సరాల తర్వాత రెండవ అత్యల్ప స్కోర్ ను ఈ మైదానంలో ఇంగ్లాండ్ జట్టు నమోదు చేసుకుంది. ఇలా ఎంతో ఉత్కంఠగా సాగుతుంది అనుకున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ దారుణమైన అపజయాన్ని అందుకుంది. అలాగే ఓ చెత్త రికార్డును కూడా అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: