కొన్ని సంవత్సరాల క్రితం క్రికెట్ ఆటలో పాకిస్తాన్ జట్టు అద్భుతమైన రీతిలో దూసుకుపోయింది. పాకిస్తాన్ జట్టు గెలుపులతో దూసుకుపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పాకిస్తాన్ జట్టు తో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్థి జట్లు కూడా కాస్త తడబడేవి. ఆ స్థాయిలో వారి పెర్ఫార్మెన్స్ ఉండేది. బ్యాటింగ్ , బౌలింగ్ , ఫీల్డింగ్ అన్ని విభాగాలలో కూడా వారు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచేవారు. దానితో పాకిస్తాన్ జట్టు తో మ్యాచ్ అంటే చాలు ఎదుటి జట్టుకు కాస్త కంగారు మొదలయ్యేది. కానీ ప్రస్తుతం మాత్రం పాకిస్తాన్ జట్టు ఆ స్థాయి ఆట తీరును అస్సలు కనబరచడం లేదు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ జట్టు చాలా పేలవమైన ప్రదర్శనను కనబరుస్తుంది. చిన్న చిన్న జట్లపై కూడా పాక్ జట్టు ఓటమి పాలవుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా పాకిస్తాన్ ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. అదేమిటి అనుకుంటున్నారా ..? పాకిస్తాన్ అత్యంత పేలవమైన ఫీల్డింగ్ జట్టుగా నిలిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూ ఏ ఈ వేదికగా ట్రై సిరీస్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా తాజాగా పాకిస్తాన్ , ఆఫ్ఘనిస్తాన్ తో తలపడింది. ఇందులో 18 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై ఆఫ్గనిస్తాన్ విజయం సాధించింది. ఇక ఆఫ్గాన్ పై పాక్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఫీల్డింగ్ మిస్టేక్స్ అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ మ్యాచ్ లో వీరు చాలా ఫీల్డింగ్ మిస్టేక్ లను చేశారు. దాని వల్లే వీరు ఓటమిపాలయ్యారు అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

ఇక పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ లో ఇలాంటి ప్రదర్శనను కనబరచడం కొత్తేమీ కాదు. క్రిక్ బుజ్ గణాంకాల ప్రకారం 2024 సంవత్సరం నుండి పాకిస్తాన్ జట్టు 48 క్యాచ్ లను , 98 రన్ అవుట్స్  ను మిస్ చేసుకుంది. అలాగే 89 మిస్ ఫీల్డ్ లను కూడా చేసింది. ఇలా పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ విషయంలో 2024 వ సంవత్సరం నుండి అత్యంత పేలవమైన  ప్రదర్శనను కనబరుస్తున్నట్లు ఈ నివేదిక ప్రకారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: