
నిన్నటి రోజున ఆసియా కప్ 2025 లో భాగంగా (ind vs UAE) పోటీ పడగా ఇండియా మ్యాచ్ గెలిచింది. ఆరంభ మ్యాచ్ లోనే ఆల్రౌండర్ షోతో అదరగొట్టిన ఇండియా మొదట బౌలింగ్ ఎంచుకొని యూఏఈని గోరంగా ఓడించింది. ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా ఇండియా అదరగొట్టేసింది. దీంతో ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఇండియా భారీ ఘనవిజయాన్ని అందుకుంది. ఈ గెలుపు పాకిస్తాన్ తో ఆదివారం రోజు జరిగే మ్యాచ్ కి మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఇండియన్స్ అందించిందని చెప్పవచ్చు.
మొదట బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ 14.3 ఓవర్లలో కేవలం 57 పరుగులకి ఆల్ అవుట్ అయ్యింది.. ఇందులో ఆలీషాన్ ఫరూఫ్ -17 బంతులలో 22 రన్నులు , మహమ్మద్ వసీం - 22 బంతులలో 19 పరుగులు చేశారు. మిగిలిన ప్లేయర్స్ ఘోరంగా అవుట్ అయ్యారు. అనంతరం 58 పరుగుల లక్ష్యంతో భారత్ మైదానంలో అడుగుపెట్టగా కేవలం 4.3 ఓవర్లకే ఒక వికెట్ మాత్రమే నష్టపోయి గెలిచింది భారత్. భారత్ ఓపెనర్లుగా అభిషేక్ శర్మ 16 బంతులలో 30 పరుగులు, శుబ్ మన్ గిల్ 9 బంతులలో 20 నాటౌట్ గా నిలిచారు.
ఆట ముగిసిన తర్వాత ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.స్టంపౌట్ విషయంలో టీమిండియా క్యాప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఒక ధర్మరాజుల వ్యవహరించి అందరిచేత ప్రశంసలు అందుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే యూఏఈ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 13వ ఓవర్లో ఇండియన్ బౌలర్ దూబే బౌలింగ్ కి రాగ.. తొలి బంతికే వికెట్ తీశారు. మూడవ బంతిని ఆడేక్రమంలో యూఏఈ బ్యాటర్ సిద్ధికి బీట్ అయ్యారు.. ఆ వెంటనే బాల్ కీపర్ సంజుసామ్స చేతిలోకి వెళ్ళగా..ఆ బంతిని వెంటనే వికెట్లకు గురి చూసి కొట్టాడు . ఆ సమయంలో క్రికెటర్ సిద్ధికి గ్రీసు బయట ఉన్నారు. ఆన్ ఫీల్ అంపైర్ థర్డ్ ఎంపైర్ కు నివేదించగా.. రిప్లై లో అంపియర్ అవుట్ అంటూ ప్రకటించారు. కానీ ఆపిల్ ని సూర్య కుమార్ యాదవ్ ఉపసంహరించుకోవడంతో సిద్ధికి నాటౌట్ గా నిలిచారు.. వాస్తవానికి అది నాటౌట్ కానీ అంపియర్లు అక్కడ ఒక విషయాన్ని గమనించలేదు.. శివమ్ దుబే 13.3 ఓవర్ లో బంతిని వేస్తున్న సమయంలో అతని ప్యాంటుకి ఉన్న టవల్ జారిపోవడం జరిగింది.. అయితే అలా జరిగిన సమయంలో ఆ బాల్ డెడ్ బాల్గా ప్రకటిస్తారు. ఒకవేళ ఆ బాల్ కి సిక్స్ కొట్టిన, అవుట్ అయిన లెక్కలేకి రాదు. మళ్లీ తిరిగి ఆ బాలు వేయాల్సిందే.. ఈ విషయాన్ని మరిచిన అంపియర్లు స్టంపౌట్ అంటూ చెప్పినప్పటికీ ఆ వెంటనే సూర్య కుమార్ యాదవ్ కలగజేసుకొని ఆ ఆపిల్ ను వెన్నకి తీసుకున్నారు. ఆ తర్వాత అంపియర్ కూడా వెంటనే నాట్ అవుట్ గా ప్రకటించారు. ఈ విషయంపై సూర్యకుమార్ యాదవ్ ని ప్రశంసిస్తున్నారు.