ఏదైనా ఒక క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది అంటే చాలు ఆ టోర్నమెంట్లో ఆడబోయే టీములో గతంలో ఎలాంటి ప్రదర్శనను కనబరిచాయి. ఆ టీం పేరున ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి అనేది తెర పైకి వస్తూ ఉంటాయి. తాజాగా ఆసియా కప్ 2025 సీజన్ ప్రారంభం అయిన విషయం మన అందరికి తెలిసిందే. దానితో ఆసియా కప్ కి సంబంధించిన పలు రికార్డుల వివరాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆసియా కప్ లో ఎక్కువ శాతం ఇండియా , శ్రీలంక ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. ఆసియా కప్ ను ఇండియా , శ్రీలంక జట్లు అనేక సార్లు దక్కించుకున్నాయి.

ఈ టోర్నమెంట్లు ఇప్పటివరకు 16 సార్లు జరిగాయి. అందులో 8 సార్లు ఇండియా కప్ ను గెలుచుకోగా , 6 సార్లు శ్రీలంక కప్ ను గెలుచుకుంది. ఇక ఇప్పటికి రెండు సార్లు ఆసియా కప్ ను టీ 20 ఫార్మేట్ లో నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ కూడా టీ 20 ఫార్మేట్ లో జరుగుతుంది. టీ 20 ఫార్మేట్ లో జరుగుతున్న మూడవ ఆసియా కప్ టోర్నమెంట్ ఇది. ఇక టీ 20 ఫార్మేట్ లో ఒక విషయంలో పాకిస్తాన్ అద్భుతమైన రికార్డును సాధించుకొని టాప్ లో కొనసాగుతోంది. 2022 వ సంవత్సరం పాకిస్తాన్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ , హాంకాంగ్ పై 155 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

అత్యధిక పరుగుల తేడాతో ఓ జట్టును ఓడించిన రికార్డులో పాకిస్తాన్ మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ రికార్డ్ విషయంలో ఇండియా రెండవ స్థానంలో ఉంది. 2022 వ సంవత్సరం ఇండియా , ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ను ఇండియా 101 పరుగుల తేడాతో ఓడించింది. ఇది భారీ పరుగుల తేడాతో ఓడించిన మ్యాచ్లలో రెండవది. ఇలా ఈ రికార్డు విషయంలో ఇండియా రెండవ స్థానంలో ఇండియా కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: