
కానీ మునుపటి సందడి ఇప్పుడు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ - ఇండియా మధ్య తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మొదటిసారి పాకిస్తాన్, ఇండియా తలపడబోతున్నాయి. పైగా యూఏఈ ని భారత్ చిత్తుగా ఓడించింది.. అటు పాకిస్తాన్ కూడా ఓమన్ పై గెలిచింది. ఈసారి టీం ఇండియా మాత్రం ఎలాగైనా సరే భారత్ కి టీ 20 ప్రపంచ ఛాంపియన్ ట్రోఫీని అందించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు ఇంకా గతేడాది కప్పు కోసం పోటీ మొదలైనప్పటి నుంచి 28 t20 లు ఆడితే.. అందులో మూడు మాత్రమే ఓడిపోయింది. ఆసియా కప్ తొలి పోరులో కూడా భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది.అలా భారత్ కు అద్భుతమైన రికార్డు కూడా ఉంది.
ఒకవేళ ఇదే పోటీని కొనసాగిస్తే భారత్ ముందు పాకిస్తాన్ నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. కానీ రెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూస్తే..అటు పాకిస్తాన్ కూడా ఈ మ్యాచ్ గెలవడానికి సర్వశక్తులా ప్రయత్నాలు చేస్తోందనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడిందని చెప్పాలి. సాధారణంగా భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వెలువడుతుందో అప్పటినుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభం అవుతుంది. ధరలు ఎక్కువగా ఉన్నా సరే పది రోజుల ముందే టికెట్స్ మొత్తం బుక్ అయిపోతాయి. అయితే ఆశ్చర్యం ఏమిటంటే.. ఈసారి టికెట్ ధరలు తగ్గించినప్పటికీ కూడా ఇప్పటికీ టికెట్లు అమ్ముడు పోకపోవడం ఆశ్చర్యం అని చెప్పాలి. కారణం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ - భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగకూడదని కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అటు సామాన్యులు కూడా ఇదే చెబుతున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది అంటే చాలామంది ఆసక్తి కనబరిచేవారు... ప్రెస్టేజియస్ గా ఫీల్ అయ్యేవారు. కానీ ఈసారి మ్యాచ్ కి మాత్రం సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఏ విధంగా జరుగుతుంది? జరిగితే ఎవరు గెలుస్తారు? అసలు సడిలేని సమరంగా మారిన ఈ యుద్ధంలో గెలిచేది ఎవరు ? అనేది తెలియాలి అంటే మ్యాచ్ పూర్తయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.