ఇండియా ,పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా హోర హొరి పోరాటం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆటగాళ్లలో కూడా ఎక్కడలేని కసి అభిమానులలో ఉత్సాహం , పతాక స్థాయిలో బాగా ద్వేగాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఓవర్ చాలా ఉత్కంఠ పరిచేలా ఉంటుంది. ఇక ఇరువురి జట్లలో గెలిచిన జట్టు అంతులేని సంబరం, ఓడిన జట్టు ఎక్కడలేని నిర్వేదం కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకప్పటి పరిస్థితి!. కానీ ఇప్పుడు పూర్తిగా కథ మారిపోయింది. గత రెండు దశాబ్దాల నుంచి ఇండియానే తిరుగు లేని ఆధిపత్యం చలాయిస్తూ ఉంటే పాకిస్తాన్ ,ఇండియా మ్యాచ్ మధ్య ఆసక్తి తగ్గిపోతోంది.


ఇండియా ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ అంతకంతకు బలహీన పడుతూనే ఉంది. ముఖ్యంగా మ్యాచులు పోటీయే లేకుండానే టీమిండియా చాలా సులువుగా గెలుస్తోంది. ఈ కారణం వల్లే ఇప్పటికీ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆసక్తి తగ్గిపోగా.. పహల్గం దాడి అనంతరం పరిణామాలతో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ వద్దనే డిమాండ్లు కూడా చాలా వినిపించాయి. నిన్నటి రోజున జరిగిన వరల్డ్ టి20 మ్యాచ్ కు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ప్రజలు ప్రజలు.


ముఖ్యంగా ఈ మ్యాచ్ వీక్షించడానికి కూడా స్టేడియం నిండలేదు. సామాజిక మధ్యమాలలో కూడా ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలే జరిగాయి. ఒకవేళ పాకిస్తాన్ నుంచి గట్టి పోటీ ఉండి ఉంటే మ్యాచ్ హోరాహోరీగా సాగి ఉంటే అభిమానులలో మార్పు కనిపించేదేమో అన్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇండియా ముందు ప్రత్యర్థి టీమ్ తేలిగ్గా తలవంచడం వల్ల భారత్ సునాయాసంగ మ్యాచ్ నెగ్గడంతో ఇంట్రెస్ట్ రాలేదంటు చూసిన వారందరూ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య పరిస్థితులు రెండు జట్ల మధ్య అంతరాయం చూస్తూ ఉంటే ఇకమీదట భారత్, పాకిస్తాన్ మ్యాచ్  అంటే మునుపటి ఆకర్షణ కనిపించడం కష్టమే అనే సందేహాలు కనిపిస్తున్నాయి. మరొకసారి ఈ రెండు జట్లు సూపర్ 4లో తలపడే అవకాశం ఉన్నది. మరి అప్పుడైనా పాకిస్తాన్, ఇండియాకి  మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: