కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ జట్టు ఎన్నో విజయాలను అందుకుంటూ అద్భుతమైన దశలో ముందుకు సాగింది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శనను కనబరుస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా పాకిస్తాన్ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్ లో పాల్గొన్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భారత్ , పాకిస్తాన్ తో సహా మరో ఆరు జట్లు బరిలోకి దిగాయి.

ఇక ఈ టోర్నమెంట్ లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్ని మ్యాచ్ లలో కూడా గెలిచి కప్పును కైవసం చేసుకుంది. ఇక పాకిస్తాన్ జట్టు ఈ టోర్నీ లో కొన్ని మ్యాచ్ లను గెలిచి , కొన్ని మ్యాచ్ లలో ఓడి చివరగా ఫైనల్ వరకు చేరుకుంది. ఆసియా కప్ టోర్నమెంట్ మొత్తంలో ఇండియా , పాకిస్తాన్ మూడు సార్లు తలబడ్డాయి. ఈ మూడు సార్లు కూడా ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలయింది. ఇక మొదటి నుండి కూడా పాకిస్తాన్ జట్టు ప్లేయర్లు ఇండియాతో మ్యాచ్ ఆడిన సందర్భంలో కాస్త ఓవరాక్షన్ చేస్తూ వచ్చారు. కాని చివరకు వారు ప్రతి మ్యాచ్ లోను ఇండియాతో ఓడిపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కూడా పాకిస్తాన్ ఆటగాళ్లపై తీవ్ర నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ఇకపోతే పాకిస్తాన్ ఆటగాళ్లు అత్యంత పేలవమైన ప్రదర్శనను ఆసియా కప్ టోల్ టోర్నమెంట్ లో ప్రదర్శించడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ ఆటగాళ్లకు అదిరిపోయే రేంజ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కొన్ని దేశాలలో జరిగే ప్రీమియర్ లీగ్ లలో ఆడే వెసులుబాటును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసేసినట్లు , దానితో వారికి ఇప్పుడు వేరే దేశాలలో జరిగే క్రికెట్ లీగ్ లలో ఆడే అవకాశం లేదు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: