
ఐపీఎల్ సమయంలో ఆయన లుక్, కదలికలే చర్చగా మారాయి. సెలెక్టర్లు కూడా ఫిట్‌గా లేనట్లయితే తుది 11లో చోటు దక్కదని స్పష్టంగా చెప్పారు. దాంతో రోహిత్ కట్టుదిట్టంగా శ్రమించి 11 కిలోలు తగ్గాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో అభిమానులు ఒక ఫిట్ రోహిత్ శర్మ ను చూడబోతున్నారు.రోహిత్ శర్మ జెర్సీ నంబరు 45 - ఆయనకెప్పుడూ లక్కీగా నిలిచిన ఈ నంబరులో 9 అనే అంకె ఉంటుంది. ఇప్పుడు ఆయన వన్డే కెప్టెన్సీని శుభ్‌మన్ గిల్‌కు ఇచ్చాడు. గిల్ జెర్సీ నంబరు 77. కోహ్లీ 13 ఏళ్ల క్రితం చేసిన “45 ముగింపు… 77 ఆరంభం” ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది రోహిత్ కెప్టెన్సీ ఎండింగ్ – గిల్ ఎరా ప్రారంభమని అభిమానులు పరిగణిస్తున్నారు.
రోహిత్ శర్మ 2007లో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించాడు. ఈ అక్టోబర్ 19తో ఆయన కెరీర్ 17 ఏళ్ల మైలురాయిని చేరుకుంటుంది. 2027 వరకూ ఆడతాడా? లేక ఆస్ట్రేలియా సిరీస్‌తో ముగుస్తుందా? అన్న ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ సిరీస్‌లో రోహిత్ బాగా రాణిస్తే ఆయన కెరీర్ కనీసం మరో ఏడాది కొనసాగే అవకాశం ఉంది. లేనిపక్షంలో సెలెక్టర్లు మరో దిశగా వెళ్లొచ్చు.కెప్టెన్‌గా భారత క్రికెట్‌ను అద్భుతంగా నడిపించిన రోహిత్ ఇప్పుడు ఫుల్ ప్రెషర్‌లో ఉన్నాడు. కానీ అభిమానులు మాత్రం “కెప్టెన్‌గా రాణించిన హిట్‌మ్యాన్… ఇప్పుడు ఆటగాడిగా మరింత చెలరేగుతాడు” అని విశ్వసిస్తున్నారు. 11 కిలోలు తగ్గి, మళ్లీ ఫిట్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ శర్మకు ఈ సిరీస్ డూ ఆర్ డై. గెలిస్తే మరో సీజన్, లేకుంటే లెజెండరీ చాప్టర్ ముగింపు. కానీ హిట్‌మ్యాన్‌పై అభిమానుల నమ్మకం మాత్రం గట్టిగా ఉంది