
ప్రస్తుతం సీఎస్కే నుంచి ఈ ఆటగాళ్లను వదులుకొనే విషయం పైన ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. మరొకవైపు రాజస్థాన్ రాయల్స్ నుంచి ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్, మహేష్ తిక్షణ, శ్రీలంక స్పిన్నర్ హసరంగ బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఎస్ ఆర్ హెచ్, ఆర్సిబి వంటి మిగిలిన జట్లలో కూడా ఎలాంటి మార్పులు ఉంటాయో అంటు క్రికెట్ అభిమానులు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 2026 ఐపిఎల్ విషయానికి వస్తే.. ఈసారి వేల ముంబైలో జరగబోతున్నట్లు సమాచారం.
దీని గురించి ఇంకా ఐపీఎల్ నిర్వహకులు ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఐపీఎల్ 2026 కి సంబంధించి వేలం జరగబోతున్నట్లు వినిపిస్తున్నాయి. bcci తో చర్చించి ప్రాంచైజీల ప్రతినిధులు ఈ తేదీలను ఎంచుకున్నట్లుగా వినిపిస్తున్నాయి. ఇంకా ఈ విషయం పైన ఐపీఎల్ కమిటీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అలాగే ప్రాంచైజీలు తమ ఆటగాలను వదులుకొనే లిస్టును బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే CSK, RR టీమ్స్ పైన ఈ ఆటగాళ్లను రిలీజ్ చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు ఐపీఎల్ టీమ్స్ లలో కనిపిస్తాయో చూడాలి మరి.