మనలో ఎంత టాలెంట్ ఉన్నా సమయం మనకు అనుకూలంగా లేనప్పుడు సైలెంట్ గా ఉండాల్సిందే..ఆ విధంగానే షెఫాలీ వర్మ కూడా   క్రికెట్ లో రాణించే టాలెంట్ ఉన్నా కానీ ప్రపంచ కప్ లో ఆడే అవకాశం దక్కించుకోలేదు. కానీ అదృష్టం ఉంటే ఏదైనా నడుచుకుంటూ వస్తుందని ఈమెను చూస్తే అర్థమవుతుంది. మొదట్లో వద్దని ఆమెను పక్కన పెట్టారు. కానీ అనూహ్యంగా ఆమెకి ప్రపంచ కప్ లో ఆడే అవకాశం వచ్చింది. అదే జట్టు విజయానికి తుది మెట్టు అయింది.. షెఫాలీ దూకుడుతో జట్టు ప్రధాన స్థాయిలోకి వెళ్లిపోయింది. దీంతో సౌత్ ఆఫ్రికాకు చెమటలు పట్టించింది. చివరికి ఉమెన్స్ వరల్డ్ కప్ లో  విజయం సాధించడంలో షెఫాలీ వర్మ  ప్రముఖ పాత్ర పోషించింది. అలాంటి ఈమె వారం రోజుల ముందు అందరిలాగే ప్రపంచ కప్ చూడడానికి టీవీ ముందు కూర్చునేది. కానీ ఫైనల్ లో ఆమెను చూడటానికి కోట్లాదిమంది ఎదురు చూశారు. ఆమె ఆట తీరు చూసి ప్రశంసల జల్లు కురిపించారు. 

కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో క్రికెట్ అభిమానించే అభిమానులంతా షెఫాలీ వర్మ  దూకుడుకు మెచ్చుకున్నారు. చివరికి ఆమె చేతుల్లో నుంచే ప్రపంచ కప్ ఇండియాకు కైవసం అయింది. మరి ఆమె ఆట తీరు ఎలా ఉందో చూద్దామా.. పురుషుల క్రికెట్ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ ఎలా చెలరేగి ఆడేవారో, ఆ విధంగానే షెఫాలీ వర్మ కూడా  హర్మత్ ప్రీత్ సేనా గెలుపులో కీలక పాత్ర పోషించింది. 15 సంవత్సరాలకే క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టిన షెఫాలి వర్మ మెరుపు ఇన్నింగ్స్ లో ఆడి జట్టులో కీలక సభ్యురాలుగా మారింది. ఈ విధంగా ఎంతో అద్భుతంగా ఆడే ఈమె టీ20 లో మాత్రమే ఉపయోగపడుతున్నా, వన్డేల్లో పెద్దగా ఇన్నింగ్స్ లు ఆడ లేక  ఇబ్బందులు పడేది. దీంతో ఈమెను గత ఏడాది చివర్లో  వన్డేలో తీసివేయడంతో ఆమె స్థానంలోకి ప్రతీక వచ్చేసింది. ఈమె ఏడు మ్యాచ్ ల్లో 308 పరుగులు చేసి అద్భుత ప్రతిభ కనబరిచింది. కానీ చివరికి బంగ్లాదేశ్ తో నామమాత్రపు లీగ్ మ్యాచ్  లో గాయపడి టోర్నీకి దూరమైంది.

దీంతో షెఫాలీకి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. సెమీఫైనల్ లో ప్రపంచ కప్ లోకి అడుగుపెట్టిన షెఫాలి కేవలం 12 పరుగులు చేసి అవుట్ అయింది. దీంతో క్రికెట్ అభిమానులంతా తిట్టుకున్నారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో ఆమె మెరుపు ఆట తీరుతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె వల్లే ఇండియా స్కోర్ 299కి పైగా దూసుకుపోయిందని చెప్పవచ్చు. కేవలం బ్యాటింగ్ లోనే కాకుండా  బౌలింగ్ లో కూడా తన ప్రతిభ కనబరిచింది. మొదటి ఓవర్ లోనే లూజ్ వికెట్ పడగొట్టింది. ఆ తర్వాత మరో బ్యాట్స్మెన్ మారీజెన్ కాఫ్ వికెట్ కూడా తీసింది. ఇలా వారం ముందు వరకు ప్రపంచ కప్ లో కనిపించని, ఈ మహిళామణి ఇప్పుడు ఇలా అద్భుత ప్రదర్శన  చేసి జట్టు విజయానికి కారణం కావడంతో ఆమె పేరు మార్మోగిపోతోంది. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా గెలిపించింది అంటూ  అభిమానులు సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: