సమాజంలో కామాంధులు ఎప్పుడు ఏ రూపంలో వస్తున్నారో అర్థం కావట్లేదు. అర్థ రాత్రి కాదు మిట్టమధ్యాహ్నం కూడా ఆడపిల్లకు సేఫ్టీ లేకుండా పోతుంది. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఆడవారు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు.. దీనికి తోడు ఆడవారిపై అవకాశం పేరుతో లైంగీక దాడులు సరే సరీ..ఇష్టం లేకపోయినా కొంతమంది వారిని వాడుకోవడం రేప్ కన్నా దారుణమైన పని.. అలా సినిమా పరిశ్రమలో ఇటీవలే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇండస్ట్రీ లో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి  ఏ లెవెల్లో ఉందో వెల్లువెత్తుతున్న ఆరోపణలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు తమకు జరిగిన అన్యాయాలు బయటకి చెప్పగా తాజాగా శృంగార తార రాఖీ సావంత్ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది. ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉంది. తన ఫ్రెండ్ చేసిన అన్యాయాని బిగ్‌బాస్ షోలో చెప్పుకొంటూ కంటతడి పెట్టుకొన్నారు. దాంతో ఒక్కసారిగా బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎమోషనల్‌గా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లో తన తోటి కంటెస్టెంట్ రాహుల్ వైద్యతో రాఖీ సావంత్ ముచ్చటిస్తూ తన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలు చెప్పుకొంటూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఓ స్నేహితుడు ఉండేవాడు.

నా తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతడి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకొన్నాను. దానిని అడ్వాంటేజ్‌గా తీసుకొని నాపై అత్యాచారానికి పాల్పడ్డారు అని రాఖీ సావంత భావోద్వేగానికి గురయ్యారు.   ఓ రోజు ఫుల్లుగా మద్యం సేవించిన అతడు నన్ను ఓ ఇంపోర్టెడ్ కారులో బంధించాడు. కారు డోర్లను లాక్ చేసి నా పై దుస్తులను తొలగించమన్నాడు అని రాహుల్‌తొ చెబుతూ రాఖీ సావంత్ కంటతడి పెట్టుకొన్నారు.నా ఫ్రెండ్ చేష్టలు అంతటితో అగలేదు. కాసేపు తర్వాత నన్ను కారులో నుంచి బయటకు తోశాడు. రోడ్డు మీద పడేసి నన్ను టార్చర్‌కు గురిచేశాడు. ఆ తర్వాత నాకు ఎలాంటి సహాయం చేయలేదు. ఆ ఘటన తర్వాత నేను ఒంటరిగా పడుకోవాలంటే భయం వేసేది. ఆ రాత్రంతా భయంతో వణికిపోయాను. ఆ సంఘటన తర్వాత మళ్లీ అతడు నన్ను కలువలేదు అని రాఖీ సావంత్ ఆవేదన వ్యక్తం చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: