ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న డైలీ సీరియల్ కార్తీక దీపం.. రోజుకో ట్విస్ట్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.దీప బ్రతుకుందా లేదా అన్నది ఇప్పుడు జనాలను కలచి వేస్తుంది.. సీతారామ కళ్యాణం పూజ తర్వాత దీప మనసులో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. మరోవైపు దీప ఆరోగ్యంపై కార్తీక్ ఆందోళన మరింత ఎక్కువైపోతుంది. దీప ఆరోగ్యం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందనే విషయం తెలిసిన తర్వాత అత్త సౌందర్యఎమోషనల్ గురయ్యారు.. 


అయితే, పరిస్థితులను చూసి, తన వెనక ఏదో జరుగుతోందని భావించింది.. ముఖ్యంగా మోనిత, కార్తిక్ లపై అనుమానాన్ని పెంచుకుంటుంది.. కార్తీక్‌తో హాట్ హాట్ డిస్కషన్ జరిగిన తర్వాత తన బెడ్‌రూంలో ఒంటరిగా ఆలోచించడం మొదలు పెట్టింది. గత రెండు రోజులుగా జరిగిన విషయాలను మననం చేసుకొన్నది. పూజకు రానని చెప్పిన కార్తీక్ సడెన్‌గా ఎందుకు రావాలని అనుకొన్నాడు. తాను రావడమే కాకుండా డాక్టర్ మోనిత, డాక్టర్ భారతీని పూజకు ఎందుకు తీసుకొచ్చారు అని ఆలోచించడం మొదలుపెట్టింది.


మోనిత, కార్తీక వ్యవహారం పై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన దీప గట్టి నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి నేనేంటో చూపిస్తాను. నేను ఎంత మొండిగా ఉంటాననే విషయాన్ని చూపిస్తా. వంట నేనే చేస్తాను అంటూ మనసులో బలంగా అనుకొన్నది. తన కళ్ల ముందు గందరగోళంగా మారిన పరిస్థితులను దీప నిర్ణయాలు కనిపిస్తాయి..అప్పటివరకు ఏమి తెలియనట్లు ఉన్న దీప ఉదయన్నే లేచి , వంటల క్కగా మారిపోయింది. చక చక పనులను చేస్తుంది.అది చూసిన కార్తిక్ అసహనం పెరిగిపోయింది. వంట చేయ కూడదనే నేను మిమల్ని విజయనగరం నుంచి తీసుకొచ్చాను. వేడి వద్ద ఉండకూడదనే విజయనగరం లో దోశెలు నేనే వేశాను. ఇక కూడా ఆమె వంట చేస్తే ఇంట్లో ఉండనక్కర్లేదు అని తన చెప్పకనే చెబుతాడు.. ఇక ఈరోజు సీన్ లోకి మోనిత ఎంటర్ అవుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: