స్నేహ నాటికలో నటించిన కావేరి చెన్నైలో జన్మించింది. ఇక ఈమె 1975 డిసెంబర్ ఒకటవ తేదీన జన్మించింది. అలా ఆమె 1990లో సినీ ఇండస్ట్రీ వైపు తన అడుగులు వేసింది. టాలీవుడ్ స్టార్ హీరో జగపతి బాబు తో కలిసి చిన్నారి ముద్దు పాప అనే మూవీలో హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత తిరిగి జగపతిబాబుతో నే సాహసం అనే సినిమాలో నటించింది. ఇక వీటితో పాటు పలు తమిళ సినిమాలలో కూడా నటించింది ఈమె.

ఇక అదే సంవత్సరంలోనే స్నేహ అనే నాటికలో కూడా నటించింది ఈమె. ఈ సీరియల్ అప్పట్లో బాగా విజయవంతంగా నడిచింది. ఈ సీరియల్ హర్రర్ తో పాటు కామెడీ ను కూడా మిక్స్ చేసి ప్రసారం చేయడం వల్ల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక వీటితో పాటే తమిళంలోనే పంచవనే కిళి, అందువరునిమిషం, వంటి పలు సీరియల్స్ లో కూడా నటించింది.

ఆనంద భవన్ అనే నటికలో కూడా ఈమె ఒక కీలక పాత్రలో నటించింది. ఇక నాటిక మెట్టివోలి అన్ని సీరియల్స్ లో కూడా నటించింది. ఈ సీరియల్ ను తెలుగులో కూడా మెట్టెల సవ్వడి గా తెరకెక్కించడం జరిగింది. ఇక వీటితోపాటే రాజా గారి కూతుర్లు అనే నాటికలలో ఒక పెద్దింటి కూతురు గా నటించింది. ఇక కలవారి కోడలు నాటికలో వదిన పాత్ర లో బాగా అలరించింది. ఇక కస్తూరి వంటి సీరియల్ లో నటించింది.

ఇక ఝాన్సీ వంటి నాటకాలలో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక తమిళంలో నుంచి రీమిక్స్ చేయబడిన పవిత్ర ప్రేమ సీరియల్ లో రమ్యకృష్ణతో కలిసి నటించింది. 2013వ సంవత్సరంలో కేరళకు చెందిన ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. ఇక అలా వివాహం చేసుకున్న కొద్ది రోజులకే తన తల్లి క్యాన్సర్ తో మరణించింది. దాంతో ఆమె చాలా డిప్రెషన్ కి గురి అయినట్లుగా తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: