ప్రస్తుతం ఉన్న కమెడియన్లలో బిత్తిరి సత్తి అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన బిత్తిరి సత్తి తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరిని తన నటనతో,మాటలతో ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా బిత్తిరి సత్తికి ఒక రకమైన స్లాంగ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. rrr సినిమా ప్రమోషన్లలో ఇంటర్వ్యూ చేసిన తర్వాత పాపులర్ కావడంతో ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలు విడుదల సమయంలో ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
ఒకప్పుడు రూ.20 వేల రూపాయల కోసం కష్టపడ్డ బిత్తిరి సత్తి ఇప్పుడు దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్పవచ్చు. బిత్తిరి సత్తి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నరసింహ,యాదమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. తన చిన్న వయసులోనే సినిమాల పైన ఆసక్తి ఉండడంతో 2003వ సంవత్సరంలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు.ఆ తర్వాత ఎంతో మంది దర్శకుడు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారట బిత్తిరి సత్తి. అలా 2012లో జీ తెలుగులో ప్రసారమవుతున్న ఒక కామెడీ క్లబ్ అనే కార్యక్రమంలో పరిచయం అయ్యారు.


ఇక తర్వాత జర్నలిజం కోర్సు చేసి ఒక ప్రముఖ ఛానల్లో తన కెరీర్ ని మొదలుపెట్టారు. అలా సావిత్రితో తీస్మార్ అనే షోలో పనిచేశారు. ఇక సావిత్రి, బిత్తిరి సత్తి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో ఎపిసోడ్లు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుచేతనే బిత్తిరి సత్తి ఏకంగా ఫిలిం స్టార్ రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక కొన్ని సినిమాలలో హీరోగా కమెడియన్ గా కూడా నటించి మంచి పేరు సంపాదించారు. అయితే తాజాగా బిత్తిరి సత్తి ఒక రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేశారని వార్త వైరల్ గా మారుతోంది. దాని ధర సుమారుగా రూ. 3 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. అయితే బిత్తిరి సత్తి కొత్తది కొన్నారా లేదంటే సెకండ్ హేండిల్ కొన్నారా అనే విషయం మాత్రం తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: